ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు,స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. యత్నకార్యసిద్ధి. మీ అంచనాలు నిజమవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
ముఖ్యమైన కార్యాలలో స్వల్ప ఆటంకాలు. అప్పులు చేస్తారు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. కొద్దిపాటి శారీరక రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. పరిశోధకులకు కొంత అనుకూల సమయం.
ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్య కార్యాలలో అవరోధాలు. బాధ్యతలు కొంత పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. శారీరక రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు అనివార్యం. కళాకారులకు ఒత్తిడులు.
ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు కొంత భారంగా మారతాయి. దేవాలయ దర్శనాలు. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.
ఆకస్మిక ధన లాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి లాభం. వ్యాపారులు లాభాల గడిస్తారు. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. దేవాలయ దర్శనాలు.
నిరుద్యోగులకు శుభవర్తమానాలు. ముఖ్య కార్యాలు చకచకా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. భూ, గృహ యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
పరిస్థితులు అంతగా అనుకూలించవు. వృథా ఖర్చులు. మీ కష్టానికి ఫలితం స్వల్పంగానే ఉంటుంది. చేపట్టిన కార్యాలు నిదానిస్తాయి. వ్యాపార,ఉద్యోగాలలో కాస్త నిరాశ. దేవాలయ దర్శనాలు. కళాకారులకు అవకాశాలు ఊరిస్తాయి.
ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో కొద్దిపాటి వివాదాలు. శారీరక రుగ్మతలు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత చికాకులు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు.
కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
కుటుంబంలో కొన్ని సమస్యలు. ముఖ్య కార్యాలు మధ్యలో విరమిస్తారు. ఆదాయం కొంత నిరాశ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు అనివార్యం. కళాకారులకు ఒత్తిడులు తప్పవు.