Ramayanam – 41 : Rama’s grief at seeing Sita Chudamani
లంక నుంచి తిరిగినవచ్చిన హనుమంతుడు, సీతను చూసిన విషయాన్ని రాముడికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తాడు. తాను సీతమ్మతల్లి పేరు ఎత్తగానే ఆమె కనిపించిందో లేదోననే ఆందోళనకి రాముడు లోనవుతాడు. సీతమ్మను రావణుడు అపహరించిన మాట నిజమేనని అంటే, ఆ తరువాత ఆయన ఆమెను ఏం చేశాడోనని కంగారుపడతాడు. అందువలన ఆ విషయాన్ని ఎలా మొదలుపెడితే బాగుంటుందా అని ఆలోచన చేస్తూ ఉండగానే, ఆయనకి ఎదురుగా రామలక్ష్మణులు ఆత్రుతగా వస్తుంటారు. దాంతో “చూసితిని సీతను” అంటూ తాను సీతమ్మతల్లిని చూశాననే విషయాన్ని ముందుగా రాముడికి చెబుతాడు.
హనుమ నోటి వెంట ఆ మాట వినగానే రాముడి ముఖం సంతోషంతో విప్పారుతుంది. ఆయన ఒక్కసారిగా హనుమంతుడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటాడు. హనుమంతుడిని తన వెంట గుహ లోపలికి తీసుకెళ్లి, సీత ఎలావుందని అడుగుతాడు. లంకలో సీతమ్మతల్లి క్షేమంగానే ఉందని చెప్పి, ముందుగా ఆమె తనకి ఇచ్చిన చూడామణిని రాముడికి అందజేస్తాడు. ఆ చూడామణిని చూడగానే రాముడు ఉద్వేగానికి లోనవుతాడు. ప్రేమానురాగాలతో ఆ చూడామణి స్పర్శిస్తాడు. తిరిగి తాను ఆ చూడామణిని సీతకి అలంకరించే రోజు వస్తుందో లేదోనని కన్నీళ్లు పెట్టుకుంటాడు.
లక్ష్మణుడు ఆయనను ఓదార్చుతాడు, సీతమ్మను తాము తప్పక రక్షించగలమనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తాడు. దాంతో రాముడు కాస్త తేరుకుని, సీతాన్వేషణలో హనుమకి ఎదురైన అనుభవాలను గురించి అడుగుతాడు. తన సముద్ర లంఘనం .. లంకానగరానికి చేరుకోవడం .. అక్కడ సీతమ్మతల్లిని చూడటం .. ఆమెతో రావణుడి సంభాషణ .. తాను వనాలను ధ్వంసం చేయడం .. ఇంద్రజిత్తు తనపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడం .. తాను రావణుడిని హెచ్చరించడం .. ఆయన తనని సంహరించాలనుకోవడం .. విభీషణుడు వారించడం .. తన తోకకి నిప్పుపెట్టడం .. మొదలైన విషయాలన్నీ వివరిస్తాడు.
రావణుడి బలాబలాలను గురించి .. ఆయన కుమారుల పరాక్రమాలను గురించి .. సైన్య సమూహాల గురించి .. లంకానగరం చుట్టూ ఉన్న వ్యూహాలను గురించి .. వాళ్ల ఆయుధ బలం గురించి .. రాక్షస మాయలను గురించి విశ్లేషిస్తాడు. సీతమ్మతల్లి విషయంలో రావణుడు పెట్టిన గడువును గురించి చెబుతాడు. ఆ లోగా ఆ తల్లిని కాపాడుకోవలసి ఉంటుందని అంటాడు. ఇప్పటికే భయంకరమైన రాక్షస స్త్రీల కాపలాలో ఆ తల్లి భయం భయంగా రోజులు గడుపుతుందని అంటాడు. ఆ క్షణమే తామంతా బయల్దేరే ముహూర్తాన్ని రాముడు నిర్ణయిస్తాడు. వానర వీరులంతా ఉత్సాహంతో గంతులు వేస్తారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 41 : Rama’s grief at seeing Sita Chudamani
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.