ఈ రోజు రాశి ఫలాలు – Today Rasi Phalalu based on moon sign
Check Today Horoscope in Telugu based on moon sign by famous astrologer Vakkantham Chandramouli gaaru. ఈ రోజు రాశి ఫలాలు జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం తెలుసుకోండి.
21 మార్చి 2025 - శుక్రవారం
జన్మ నక్షత్రం ప్రకారం
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) దూర ప్రయాణాలు. వాహనాలు భద్రంగా చూసుకోండి. శారీరక రుగ్మతలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాణిజ్య, వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు. ఉద్యోగులకు అనుకోని విధంగా బదిలీలు. రాజకీయ, పారిశ్రామికరంగం వారికి ఒత్తిడులు. విద్యార్థులు మరింత శ్రమపడే కాలం. మహిళలకు కొంత నిరుత్సాహం తప్పదు. అనుకూలం...బంగారు, తెలుపు. ప్రతికూలం...ఆకుపచ్చ. అంగారక స్తోత్రాలు పఠించండి.
వృషభం
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు) పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటాయి. ప్రత్యర్థులను చాకచక్యంగా ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహం. వాణిజ్య, వ్యాపారాలు అనుకున్న విధంగా సాగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఊహించని అవకాశాలు. విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. మహిళలకు కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది. అనుకూలం...తెలుపు, ఆకుపచ్చ. ప్రతికూలం.. గులాబీ. గురు దత్తాత్రేయుని ఆరాధించండి.
మిథునం
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాల పై ఆసక్తి చూపుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. నూతన వ్యాపారాలు కలసివస్తాయి. ఉద్యోగులకు వివాదాలు సద్దుకుంటాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమవారికి మరిన్ని అవకాశాలు. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు విశేష గుర్తింపు. అనుకూలం...బంగారు. గోధుమ. ప్రతికూలం...తెలుపు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) సన్నిహితులతో తగాదాలు. దూర ప్రయాణాలు. కుటుంబంలో వివాదాలు నెలకొంటాయి.. ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వాణిజ్య, వ్యాపారాలలో తొందరపాటు వద్దు. ఉద్యోగులకు విధి నిర్వహణలో గందరగోళ పరిస్థితి. రాజకీయవేత్తలు, వైద్యులకు మానసిక అశాంతి. విద్యార్థులు ఫలితాలు నిరాశ పరుస్తాయి. మహిళలకు అనారోగ్యం, ఔషధసేవనం. అనుకూలం...ఎరుపు, పసుపు. ప్రతికూలం...కాఫీ. గణపతి స్తోత్రాలు పఠించండి.
సింహం
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) వ్యవహారాల్లో ఆటంకాలు. రుణాలు చేయాల్సివలసిన పరిస్థితి. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. బంధువులతో లేనిపోని తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వాణిజ్య.వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు ఎదుర్కొంటారు.. సాంకేతిక నిపుణులు, రాజకీయవర్గాలకు ఉత్సాహం తగ్గుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాల కష్టమే. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూలం...ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూలం...పసుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
కన్య
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) నూతన ఉద్యోగ యోగం. పనులు విజయపథంలో సాగుతాయి. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. వాహనయోగం. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాణిజ్య, వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. విద్యార్థులకు నూతన అవకాశాలు. మహిళలకు నూతనోత్సాహం. అనుకూలం...గోధుమ, కాఫీ. ప్రతికూలం...నేరేడు. రామరక్షా స్తోత్రాలు పఠించండి.
తుల
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు) ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆస్తి విషయాలు చికాకు పరుస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు. శారీరక రుగ్మతలు. వాణిజ్య, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులు స్థానమార్పులు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమవారికి ఒడిదుడుకులు. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలకు మరింత కృషి చేయాలి. మహిళలకు కుటుంబసభ్యుల నుంచి సహాయనిరాకరణ. అనుకూలం...నీలం, తెలుపు. ప్రతికూలం...ఆకుపచ్చ. శివ పంచాక్షరి పఠించండి.
వృశ్చికం
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) ఆలోచనలు అమలు చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. పాత బాకీలు వసూలవుతాయి. వాహన సౌఖ్యం. కీలక నిర్ణయాలకు తగిన సమయం. వాణిజ్య,వ్యాపారాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది.. ఉద్యోగులకు ఉన్నత స్థితి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. మహిళలు అందరిలోనూ గౌరవం పొందుతారు. అనుకూలం...గోధుమ, తెలుపు. ప్రతికూలం..బంగారు. ఆంజనేయ దండకం పఠించండి.
ధనుస్సు
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. బంధువులతో వైరం. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శారీరకపరమైన రుగ్మతలు. పనుల్లో కొన్ని ఆటంకాలు. వాణిజ్య,వ్యాపారులకు లాభాలు సన్నగిల్లుతాయి.. ఉద్యోగాల్లో పని ఒత్తిడులు. వైద్యులు,పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహమే. విద్యార్థులకు కొన్ని అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. అనుకూలం...కాఫీ, బంగారు. ప్రతికూలం...పసుపు. లక్ష్మీ గణపతిని పూజించండి.
మకరం
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు) ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు. కొత్త వ్యక్తుల పరిచయం. పనులు చకచకా పూర్తి చేస్తారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆదాయం కొంత పెరుగుతుంది. బంధువులు, మిత్రులతో విభేదాలు తీరతాయి.. వాణిజ్య, వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ప్రమోష¯Œ లు దక్కుతాయి. సాంకేతిక నిపుణులు, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. మహిళలకు ఆస్తి వివాదాలు తీరతాయి. అనుకూలం...ఎరుపు, పసుపు. ప్రతికూలం...ఆకుపచ్చ. ఆదిత్య హృదయం పఠించండి.
కుంభం
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు) పనుల్లో అవాంతరాలు. శారీరక రుగ్మతలు. ఆదాయం అంతగా కనిపించదు. సన్నిహితులతో అకారణంగా తగాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు. వాణిజ్య,వ్యాపారాలలో కొంత నిరాశ తప్పదు. ఉద్యోగులకు అదనపు పనిఒత్తిడులు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు మరింత కష్టపడాలి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూలం...నలుపు, ఆకుపచ్చ. ప్రతికూలం..గులాబీ. దుర్గా స్తోత్రాలు పఠించండి.
మీనం
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. వాణిజ్య, వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆదరణ పెరుగుతుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. మహిళలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకూలం...ఎరుపు, గులాబీ. ప్రతికూలం...ఆకుపచ్చ. నృసింహ స్తోత్రాలు పఠించండి.
ఈ రోజు రాశి ఫలాలు జన్మ తేది/సూర్య రాశి ప్రకారం – Today rasi phalalu in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
Today Horoscope in Telugu by Vakkantham Chandramouli’s Janmakundali.com
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope (today horoscope in telugu), festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.