Ramayanam – 52 : Sarama gives confidence to Sita

సీతాదేవి ఎప్పుడైతే కన్నీళ్ల పర్యంతమైందో, ఆమె తన మాటలను నమ్మేసిందని రావణుడు అనుకుంటాడు. ఇకపై రాముడు వస్తాడు .. లంకా నగరాన్ని నాశనం చేస్తాడు .. తనని రక్షిస్తాడు వంటి మాటలు ఆమె నోటివెంట రావడానికి అవకాశమే లేదని చెప్పేసి రావణుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆయన అలా వెళ్లగానే అంతకుముందు ఆయన అక్కడ ఉంచిన రాముడి శిరస్సు మాయమవుతుంది. సీతాదేవి అదేపనిగా రోదిస్తూ ఉంటుంది. రావణుడు వెళ్లింది గమనించిన విభీషణుడి భార్య సరమ అక్కడికి వస్తుంది.

కన్నీళ్ల పర్యంతమైన సీతాదేవిని పైకి లేవదీసి కూర్చోబెడుతుంది. సీతాదేవి కన్నీళ్లు తుడిచి బాధపడొద్దని చెబుతుంది. రావణుడు మహా మాయావి అనీ, ఆయన మాటలను నమ్మవద్దని అంటుంది. రాముడిని అంతమొందించినట్టు ఆయన చెబుతున్న మాటలు అబద్ధాలు అని చెబుతుంది. ఆ శిరస్సు మాయతో సృష్టించింది కావడం వల్లనే, రావణుడు వెళ్లగానే అది అక్కడి నుంచి మాయమైందని అంటుంది. తనమాటలు నమ్మకపోతే, తాను స్వయంగా వెళ్లి చూసివస్తానని అంటుంది. దాంతో ఆమె వైపు సీతాదేవి ఆశ్చర్యంగా చూస్తుంది.

సీతాదేవి చూపులను అర్థం చేసుకున్న సరమ తనకి ఆకాశయానం చేయడం తెలుసు అని చెప్పి వెళుతుంది. కొంతసేపటి తరువాత సరమ అక్కడికి వస్తుంది. ఆకాశమార్గం నుంచి తాను అంతా చూశాననీ, రామలక్ష్మణులు జీవించే ఉన్నారనీ, రావణుడిపై యుద్ధానికి ముందుకు కదులుతున్నారని చెబుతుంది. రామలక్ష్మణులకు అండగా కోట్ల సంఖ్యలో వానరులు ఉన్నారని అంటుంది. లంకా నగరాన్ని ముంచివేయడానికి వస్తున్న సముద్రంలా వాళ్లు కదులుతున్నారని చెబుతుంది. అందువలన అనవసరమైన భయాలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండమని అంటుంది.

సరమ మాటలకు సీతాదేవి మనసు కుదుటపడుతుంది. రావణుడి మాటల వలన అల్లకల్లోలమైన ఆమె హృదయం తేలికపడుతుంది. రామలక్ష్మణులు సమస్త వానర సైన్యంతో లంకానగరాన్ని ముట్టడించడం, తనని రావణుడి చెర నుంచి విడిపించడం జరిగి తీరుతుందని భావిస్తుంది. భగవంతుడి అనుగ్రహం అందుకు తోడుకావాలని అనుకుంటుంది. ఇక రామలక్ష్మణులు వానర సేనలతో ముందుకు కదలడంతో, వాళ్లని ఎదుర్కోవడానికి రావణుడి సేనలు కదులుతాయి. అలా యుద్ధం మొదలవుతుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 52 : Sarama gives confidence to Sita

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: