Ramayanam – Ashwamedhayaga starts .. Lava captures horse
లోక కల్యాణం కోసం అశ్వమేధయాగం ప్రారంభమవుతుంది, సీతాదేవి స్వర్ణ విగ్రహాన్ని పక్కన పెట్టుకుని రాముడు యాగంలో పాల్గొంటాడు. వశిష్ఠుడు, రుష్యశృంగుడు మొదలగు మహర్షులు ఆ యాగంలో పాల్గొంటారు. ఆ యాగంలో భాగంగా యాగాశ్వాన్ని వదులుతారు. అలా వదిలిన అశ్వాన్ని ఎవరూ ఆపకూడదు, బంధించకూడదు. అశ్వం ఏ రాజ్యంలోకి అడుగుపెట్టిందో అక్కడివారు ధన సహాయం చేయవలసి ఉంటుంది. ఎవరైనా అశ్వాన్ని బంధిస్తే వాళ్లతో ఆ అశ్వం వెనుక వచ్చేవారు యుద్ధం చేసి విడిపించడం జరుగుతుంది.
అలా రాముడు అశ్వమేధయాగాన్ని ప్రారంభించగానే, యాగాశ్వన్ని వదులుతారు. యాగాశ్వం పరుగులు తీస్తూ వెళుతూ ఉంటుంది, కొంతమంది సైన్యంతో దానిని శత్రుఘ్నుడు అనుసరిస్తూ ఉంటాడు. అలా ఆ యాగాశ్వం వాల్మీకీ మహర్షి ఆశ్రమ సమీపంలోకి వెళుతుంది. ఆ యాగాశ్వాన్ని లవుడు చూస్తాడు. సీతమ్మతల్లిని రాముడు అడవులకు పంపించడం సరికాదనే ఒక రకమైన ఉక్రోషం లవుడిలో ఉంటుంది. అందువలన అతను ఆ యాగాశ్వాన్ని చూడగానే దానిని తీసుకొచ్చి బంధిస్తాడు.
కొంతదూరం వెళ్లిన శత్రుఘ్నుడికి ఆయన పరివారానికి యాగాశ్వం కనిపించదు. అది ఏమై పోయిందా అని వాళ్లంతా వెదకడం మొదలుపెడతారు. యాగాశ్వం ఎక్కడి వరకూ వచ్చి అదృశ్యమైందో అక్కడి నుంచి వెదకడానికి సైనికులు తలో దిక్కుకు వెళతారు. ఎక్కడా యాగాశ్వం కనిపించదు. ఆ పరిసర ప్రాంతాల్లో ఆశ్రమాలు తప్ప మరేవీ కనిపించవు. అది ఇతర రాజ్యాలకు సంబంధించిన వీరులు తిరిగే ప్రదేశం కూడా కాదు. అలాంటప్పుడు ఎవరైనా అశ్వాన్ని బంధించారనుకోవడానికి కూడా లేదే అనే ఆలోచనలో పడతారు.
కొంతమంది సైనికులకు ఒక చెట్టుకు యాగాశ్వం కట్టేసి కనిపిస్తుంది. హమ్మయ్య అశ్వం దొరికేసిందని ఆనందిస్తూ వాళ్లు దానిని విడిపించడానికి ప్రయత్నిస్తారు. అంతలో లవుడు వచ్చి వాళ్లను అడ్డుకుంటాడు. రాముడు అశ్వమేధయాగం చేస్తున్నాడనీ, ఆ సందర్భంగా వదిలిన అశ్వం అదని వాళ్లు చెబుతారు. తెలియక కట్టేసి ఉంటే వదిలేయమని చెబుతారు. తాను తెలిసే కట్టేశాననీ, అశ్వాన్ని వదిలేది లేదని అంటాడు. అలా అయితే శతృఘ్నుడితో యుద్ధం చేయవలసి ఉంటుందని వాళ్లంతా హెచ్చరిస్తారు. అందుకు తాను సిద్ధమేనని లవుడు సమాధానమిస్తాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – Ashwamedhayaga starts .. Lava captures horse
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.