Ramayanam – 1 : Putrakameshti Yagam

సూర్యవంశంలో జన్మించిన దశరథ మహారాజు, అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ధర్మబధ్ధంగా సాగుతున్న ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. దశరథుడికి కౌసల్య, కైకేయి, సుమిత్రలతో వివాహం జరుగుతుంది. అయితే ఈ ముగ్గురి నుంచి వారసులు లేకపోవడం దశరథుడిని మానసికంగా బాధిస్తూ ఉంటుంది. తన ఆవేదనను ఆయన వశిష్ఠ మహర్షితో పంచుకుంటాడు. పుత్రకామేష్టి యాగం చేయడం వలన ఆశించిన ఫలితం లభిస్తుందని వశిష్ఠ మహర్షి చెబుతాడు. అందుకు అంగీకరించిన దశరథుడు, తగిన సన్నాహాలు మొదలుపెట్టమని తన మంత్రి అయిన సుమంత్రుడిని ఆదేశిస్తాడు.

సరయూ నదీ తీరంలో పుత్రకామేష్టి యాగం మొదలవుతుంది. ఎంతోమంది వేద పండితులు, మహర్షుల సమక్షంలో దశరథుడు యాగాన్ని పూర్తిచేస్తాడు. అత్యంత భక్తిశ్రద్ధలతో యాగాన్ని పూర్తిచేసిన కారణంగా యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమవుతాడు. దైవ సంబంధమైన ఒక పాయస పాత్రను దశరథుడికి అందజేస్తాడు. ఆ పాయసాన్ని సేవించిడం వలన, ఆయన భార్యలు ముగ్గురూ కూడా గర్భవతులు అవుతారనీ, మహావీర పరాక్రమవంతులను బిడ్డలుగా పొందుతారని ఆశీర్వదిస్తాడు. దశరథుడు యజ్ఞపురుషుడికి భక్తి పూర్వకంగా నమస్కరించి ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలు సేవించేలా చేస్తాడు.

పుత్రకామేష్టి యాగం ఫలితంగా కౌసల్య, కైకేయి, సుమిత్ర గర్భవతులు అవుతారు. కౌసల్యకి శ్రీరామచంద్రుడు జన్మిస్తాడు. కైకేయి గర్భాన భరతుడు జన్మిస్తాడు. సుమిత్ర గర్భాన లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు. ఇలా దశరథుడి ముగ్గురు భార్యలు, నలుగురు మగ బిడ్డలను కనడంతో, అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంటుంది. అంతఃపురంలో ఎక్కడ చూసినా సందడిగానే కనిపిస్తూ ఉంటుంది. ఊరూరా ప్రజలంతా సంతోషంగా సంబరాలు జరుపుకోవడానికి తగిన ఏర్పాట్లను దశరథ మహారాజు చేయిస్తాడు. ఆ ఇంట్లోని పండుగ వాతావరణమే అయోధ్య అంతా కనిపిస్తూ ఉంటుంది.

ఎంతోకాలంగా అనుభవిస్తూ వస్తున్న ఆవేదనకి ఔషధం దొరికినట్టుగా దశరథుడు ఆనందంతో పొంగిపోతుంటాడు. తన ముచ్చట తీర్చడానికీ, అయోధ్యా ప్రజలను ధర్మబద్ధంగా పాలించడానికి తనకి నలుగురు వారసులను ఇచ్చిన భగవంతుడికి ఆయన మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. దశరథుడు ఒక వైపున పాలనా సంబంధమైన వ్యవహారాలను చక్కబెడుతూనే, మరో వైపున తన పిల్లలతో ఆటలాడుతూ ఆనందానుభూతులను పొందుతుంటాడు. వాళ్లు తప్పటడుగులు వేస్తూ ఉంటే చూసి మురిసిపోతూ ఉంటాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 1 : Putrakameshti Yagam

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: