Ramayanam – 43 : Vibhishana advises Ravana
హనుమంతుడు లంకా నగరానికి వచ్చి వెళ్లిన దగ్గర నుంచి రావణుడు అదోలా ఉండటాన్ని విభీషణుడు గమనిస్తాడు. సీతమ్మను ఆయన అపహరించి తీసుకురావడం గురించి ప్రస్తావిస్తాడు. ఆమెను లంకానగరానికి తీసుకువచ్చిన దగ్గర నుంచి తన మనసేదో కీడు శంకిస్తోందని అంటాడు. ఆయన చేసిన పని వలన లంకానగరం అంతా కూడా ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతాడు. తొలి రోజు నుంచి తాను చెబుతునే ఉన్నానని అంటాడు. తన మాట వినకపోవడం వల్లనే, ఒక వానరం వచ్చి ఇంతటి రచ్చ చేసి వెళ్లిందని చెబుతాడు.
ఆ మాటలకు రావణుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. సీతను అపహరించి తెచ్చిన తన నిర్ణయాన్ని సమర్థించకుండా భయపెట్టడం సరికాదని అంటాడు. సీతను తిరిగి అప్పగించడం కంటే అవమానం మరేమీ లేదని చెబుతాడు. అన్న అవమానం తన అవమానమని ఆయన భావించకపోవడం ఆశ్చర్యంగా ఉందని అంటాడు. తాను అనేక పనులతో సతమతమవుతూ ఉంటే, ఆ వానరం లంకలోకి జొరబడిందనీ, అలా జరగకుండా చూసుకోవలసిన బాద్యత నీకు లేదా? అని అడుగుతాడు. అంతఃపురం వరకూ ఒక వానరం రావడం, లోపల ఉన్న తమ అందరికీ అవమానమేనని అంటాడు.
వానరం వచ్చి వెళ్లడం గురించి తాను ఆలోచించడం లేదనీ, ఆ వానరం రాముడిని వెంటబెట్టుకు రావడం గురించి ఆలోచిస్తున్నానని విభీషణుడు అంటాడు. రాముడే వస్తే జరిగే అనర్థం గురించి ఆలోచిస్తున్నానని చెబుతాడు. ఒక వానరమే ఇంతటి బీభత్సాన్ని సృష్టించిందంటే, అలాంటి వానరాలు లెక్కకు మించి వస్తే పరిస్థితి ఏమిటని అడుగుతాడు. రాముడి పరాక్రమాన్ని గురించి తాను విని ఉన్నాననీ, ఆయన శక్తిసామర్థ్యాలను తక్కువగా అంచనా వేయవద్దని అంటాడు.
వ్యక్తిగతమైన పరువు ప్రతిష్ఠలకంటే, రాజ్య క్షేమం తమకి ముఖ్యమని హితవు చెబుతాడు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని చెబుతాడు. ఆ మాటలు వినగానే రావణుడు ఉగ్రుడవుతాడు. తాను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాననీ, అవకాశం దొరికినప్పుడల్లా రాముడి పరాక్రమాన్ని గురించి గొప్పలు చెబుతూ, తనని అవమానపరచడం సరికాదని రావణుడు అంటాడు. తనకి అండగా నిలవకపోగా, పిరికిమాటలతో తన ధైర్యంపై దెబ్బకొడుతూ వస్తున్న విభీషణుడుని తన కళ్ల ముందు నుంచి తక్షణమే వెళ్లిపొమ్మని ఆదేశిస్తాడు రావణుడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 43 : Vibhishana advises Ravana
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.