అజామీళుడు మృత్యువు నుంచి బయటపడతాడు. విష్ణుదూతలకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంటాడు. నిదానంగా లేచి స్నానాదికాలు పూర్తిచేసుకుంటాడు. పూజామందిరంలో దీపారాధన చేసి భగవంతుడికి ఒకసారి నమస్కారం చేసుకుంటాడు. ఆయన కళ్లు వర్షిస్తూ ఉంటాయి. యవ్వనంలో తాను ఎన్నో పొరపాట్లు .. తప్పులు చేశాడు….
విష్ణుదూతలు .. యమదూతల మధ్య జరుగుతున్న సంభాషణ అజామీళుడికి వినిపిస్తూనే ఉంటుంది. ఇద్దరిలో ఎవరు తన ప్రాణాలను తీసుకెళతారోనని ఆయన వాళ్ల సంభాషణపైనే దృష్టి పెడతాడు. యమధర్మరాజు అనుమతి మేరకే తాము అజామీళుడిని తీసుకెళ్లడానికి వచ్చామనీ, ఆయన ఆదేశాన్ని తప్పనిసరిగా ఆచరించవలసిన…
ఒక వైపున కన్నవాళ్లను .. మరో వైపున కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేసిన అజామీళుడు, తన కొడుకును మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటూ వస్తాడు. వయసుతో పాటు కొడుకు పట్ల వ్యామోహం పెరుగుతూ వస్తుంది. అలా కొడుకే జీవితంగా రోజులు గడుపుతూ…
పరపురుషులను ఆకర్షించడమే పనిగా పెట్టుకున్న ఆ స్త్రీ, తన పట్ల అజామీళుడు ఆసక్తిని చూపుతుండటం గమనిస్తుంది. తాను పుట్టిపెరిన వాతావరణం వేరు .. తనకి గల అలవాట్లు వేరు. అయినా తానంటే ఆయన ఇష్టపడుతుండటం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన అలవాట్లు…
ఎప్పటిలానే అజామీళుడు అడవికి వెళ్లి దర్భలు కోసుకుని .. పూలు .. పండ్లు సేకరిస్తుంటాడు. ఆ సమయంలో ఒక పొదల చాటున ఏదో అలికిడి అవుతుంది. దాంతో ఆయన అక్కడ ఏం ఉందా అనే ఆలోచనతో అటు వైపు చూస్తాడు. అక్కడి…
పూర్వం ఒకానొక రాజ్యంలో అజామీళుడు అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతను మంచి అందగాడు .. శాస్త్రం తెలిసినవాడు. భగవంతుడి పట్ల భక్తి ఉన్నవాడు .. తల్లితండ్రుల పట్ల ప్రేమ .. భార్యపట్ల అనురాగం ఉన్నవాడు. చిన్నప్పటి నుంచి ఆచారవంతులైన తల్లిదండ్రుల…
సరస్సులో చాలా కాలంగా నివాసం ఉంటున్న మొసలి, సుదర్శన చక్రం కారణంగా ప్రాణాలు కోల్పోతుంది. ఆ మొసలి గంధర్వుడిగా నిజరూపాన్ని పొంది తన లోకానికి వెళ్లిపోతుంది. గంధర్వుడు మొసలిగా జన్మించడానికి వెనుక కూడా ఒక బలమైన కారణం కనిపిస్తుంది. “హూ హూ”…
శ్రీమహా విష్ణువు ఎప్పుడైతే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడో .. అప్పుడే మొసలి శిరస్సు ఖండించబడుతుంది. దాని తల .. మొండెం వేరై సరస్సులో తేలిపోతాయి. అప్పుడు ఆ మొసలిలో నుంచి ఒక దివ్యజ్యోతి బయటికి వచ్చి గంధర్వుడిగా నిజరూపాన్ని పొందుతుంది. తనకి…
శ్రీమహా విష్ణువు .. వైకుంఠపురములో లక్ష్మీదేవితో కలిసి సరదాగా కబుర్లు చెబుతూ ఉంటాడు. అదే సమయంలో ఆయనకు ఏనుగు ఆర్తితో చేసిన ఘీంకారం వినిపిస్తుంది. ఆపదలో ఉన్న ఏనుగు రక్షించమని కోరుతుందని గ్రహించిన విష్ణుమూర్తి, ఒక్కసారిగా అక్కడి నుంచి కదులుతాడు. ఆ…
మొసలి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో గజేంద్రుడు అలసిపోతాడు. ఇక మొసలి కారణంగా తన ప్రాణాలు పోవడం ఖాయమనే విషయం గజేంద్రుడికి అర్థమైపోతుంది. దాంతో భగవంతుడిని శరణు కోరడం వలన ఫలితం ఉంటుందనే విషయం గజేంద్రుడికి గుర్తుకు వస్తుంది. ఈ సమస్త…