Ramayanam – 10 : Dasaratha decision

కాలం గడుస్తూ ఉంటుంది, దశరథుడు తనకి వయసైపోయిందనే విషయాన్ని గ్రహిస్తాడు. ఇక రాజ్యభారాన్ని తాను మోయలేనని భావిస్తాడు. రాజ్యభారాన్ని రాముడికి అప్పగించాలని నిర్ణయించుకుంటాడు. రాముడు తన కుమారులలో పెద్దవాడు కావడమే కాకుండా, ధర్మము నందు అవగాహన, అనురక్తి కలిగినవాడు కావడం వలన రాముడు అన్ని విధాలా తగినవాడు అని భావిస్తాడు. సూర్యవంశం యొక్క పేరు శౌర్య పరాక్రమాలను చాటగలిగినవాడు, పేరు ప్రతిష్ఠలను నిలపగలిగినవాడు రాముడు ఒక్కడేనని తాను తీసుకున్న నిర్ణయాన్ని ఖాయం చేసుకుంటాడు.

రాముడికి రాజ్యాన్ని అప్పగించే విషయాన్ని గురించి కుల గురువులైన వశిష్ఠ మహర్షితో చర్చిస్తాడు. దశరథుడు ఎలా అనుకుంటే అలా చేయమని వశిష్ఠుడు అంటాడు. దాంతో దశరథుడు సంతోషంతో పొంగిపోతాడు. వశిష్ఠ మహర్షితోనే మంచి ముహూర్తం పెట్టించి, రాముడికి “పట్టాభిషేకం” జరపనున్నట్టు అయోధ్య నగరంలో చాటింపు వేయిస్తాడు. రాముడు తమకి రాజు అవుతున్నాడని తెలియగానే ప్రజలంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ప్రజాభిప్రాయం తెలిసి దశరథుడు కూడా సంతోషంతో పొంగిపోతాడు. రాముడికి రాజ్యాన్ని అప్పగించి తాము వానప్రస్థానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు.

రాముడి పట్టాభిషేక మహోత్సవాన్ని గురించి తెలుసుకున్న కౌసల్య ఎంతగానో ఆనందిస్తుంది. పట్టాభిషేక మహోత్సవం పూర్తికాగానే, భర్తతో కలిసి వానప్రస్థం వెళ్లడానికి సిద్ధమవుతుంది. రాముడు రాజు అవుతున్నందుకు కౌసల్య పడుతున్న ఆనందాన్ని చూసి, కైకేయి దగ్గర చనువుగా ఉండే “మంధర” ఉడుక్కుంటుంది. కౌసల్యకి ఆ సంతోషం దక్కకూడదనే ఉద్దేశంతో నేరుగా కైకేయి మందిరానికి బయల్దేరుతుంది. రాముడి పట్టాభిషేక మహోత్సవం గురించి తెలిస్తే కైకేయి ఎలా స్పందిస్తుందో ఏమిటో అనే ఆలోచన చేస్తూ ఆమె మందిరానికి వెళుతుంది.

కైకేయి ఎంతో సంతోషంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతూ, కారణమేమిటని అడుగుతుంది. అయోధ్యకి రాజుగా రాముడికి పట్టాభిషేకం జరగనున్నట్టుగా ఆమెతో కైకేయి చెబుతుంది. రాముడు ఎంతో ధర్మపరుడనీ సహనంలో, శౌర్యంలో అతనికి సాటిలేరని అంటుంది. తన చేతులతో ఎత్తుకుని పెంచిన రాముడు, రాజు అవుతుండటం తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెబుతోంది. తన జీవితంలో ఇంతకుమించిన సంతోషం మరొకటి ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. రాముడిని రాజుగా ఎప్పుడు చూస్తానా అని తన మనసు తపిస్తోందని అంటుంది. ఆ మాటలకు మంధర బిత్తరపోతుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 10 : Dasaratha decision

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: