Ramayanam – 9 : Parashurama arrives

రామ లక్ష్మణులను, భరత శతృఘ్నులను వారి భార్యలను వెంటబెట్టుకుని దశరథ మహారాజు అయోధ్యా నగరానికి బయల్దేరతాడు. అలా వాళ్లు కొంతదూరం వెళ్లగానే వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకు కారణం ఏమై ఉంటుందా అని దశరథుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. అంతలో ఒక సుడిగాలి వారిని చుట్టుముడుతుంది. హఠాత్తుగా ఆ సుడిగాలి కమ్ముకోవడంతో, అంతా కూడా ఎక్కడివారు అక్కడే నిలబడిపోతారు. ఆ సుడిగాలి క్రమక్రమంగా తేలిపోయి, ఆ స్థానంలో పరశురాముడు ఉండటం చూస్తారు.

పరశురాముడిని చూడగానే దశరథుడు ఎంతో వినయంగా నమస్కరిస్తాడు. పరశురాముడు ఆగ్రహావేశాలతో ఉండటం చూసి కారణం అడుగుతాడు. శివధనుసును విరిచింది ఎవరని పరశురాముడు కోపంగా అడుగుతాడు. తన కుమారుడైన రాముడేనని దశరథుడు చెబుతాడు. రాముడు ఆ విధంగా చేయడం శివుడిని అవమానించడమేనని పరశురాముడు అంటాడు. రాముడు అంతటి శక్తిమంతుడే అయితే తన దగ్గర గల వైష్ణవ ధనస్సును చేతబట్టుకోమని అందిస్తాడు. రాముడు ఆ వైష్ణవ ధనుస్సును అవలీలగా అందుకుంటాడు.

తాను తప్ప మరెవరూ మోయలేని వైష్ణవ ధనుస్సును రాముడు చాలా తేలికగా తన నుంచి అందుకోవడం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దాంతో రాముడు సామాన్య మానవుడు కాదనే విషయం ఆయనకి బోధపడుతుంది. రాముడిని పరిశీలనగా చూసిన పరశురాముడు, ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనని గ్రహిస్తాడు. రామావతార కార్యం మొదలైందని భావించిన ఆయన, అక్కడి నుంచి తపో భూముల దిశగా సాగిపోతాడు. దాంతో అంతా కూడా తేలికగా ఊపిరి పీల్చుకుని అక్కడి నుంచి ముందుకు కదులుతారు.

రామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి, వారి భార్యలంతా అయోధ్యా నగరానికి చేరుకుంటారు. నలుగురు కొత్త కోడళ్లు ఒక్కసారిగా రావడంతో, అంతఃపురంలో ఎక్కడ చూసినా సంతోషకరమైన వాతావరణం చోటుచేసుకుంటుంది. ఇక దశరథుడి ఇంటి పండుగ అంటే రాజ్యమంతా పండుగే. అందరూ కూడా తమ ఇళ్లకు తోరణాలు కట్టుకుని, సంతోషంతో సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. సీత అడుగుపెట్టడంతో అయోధ్యకు ఒక అందం వస్తుంది, ఒక నిండుదనం వస్తుంది. సాక్షాత్తు ఆమె లక్ష్మీదేవి కావడం వలన, ఆమె అడుగుపెట్టడంతోనే అయోధ్య కళకళలాడిపోతూ ఉంటుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 9 : Parashurama arrives

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: