Ramayanam – 100 : End of Lord Rama avatar

రాముడు తీసుకున్న నిర్ణయం లక్ష్మణుడికి ఆనందాన్ని కలిగిస్తుందే తప్ప, ఆవేదన కలిగించదు. తన విషయంలోను రాముడు ధర్మబద్ధమైన నిర్ణయమే తీసుకున్నందుకు ఆయన సంతోషిస్తాడు. ఒకసారి శ్రీరాముడి దివ్యమంగళ విగ్రహాన్ని ఆయన కనులారా చూస్తాడు. ఆ మనోహర మూర్తి రూపాన్ని మనసులోనే నింపుకుంటాడు. రాముడికి దూరమైపోతున్నందుకు తాను పడే బాధకంటే, తనకి దూరమవుతున్నందుకు రాముడు పడే బాధ ఎక్కువగా ఉంటుందని భావిస్తాడు. భక్తి పూర్వకంగా రాముడికి నమస్కరించి లక్ష్మణుడు అక్కడి నుంచి వెనుదిరుగుతాడు.

లక్ష్మణుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడని భావించిన రాముడు తన ఆసనంపై ఒక్కసారిగా కూలిపోతాడు. చిన్నప్పటి నుంచి తన ప్రాణంలా, తన నీడలా అనుసరించిన లక్ష్మణుడి పట్ల తాను చాలా నిర్దయగా వ్యవహరించవలసి వచ్చింది. తన అనురాగం కోసం, తన ఆదేశం కోసం అహర్నిశలు ఎదురుచూసిన లక్ష్మణుడు తనని వదిలి వెళుతున్నాడు, లేదు తనే వెళ్లిపొమ్మన్నాడు. భార్యకి దూరమై 14 ఏళ్లపాటు తనతో అనేక కష్టాలు పడ్డాడు. తనకంటే ముందుగా రాక్షస వీరులను ఎదుర్కోవడానికి ముందుకు ఉరికాడు.

తన ధైర్యం .. తన సాహసం .. తన పరాక్రమం .. తన శరీరం నుంచి బయటికి వచ్చి ధరించిన రూపంలా లక్ష్మణుడు కనిపించేవాడు. తాను ఏ సమయంలో బలహీనపడినా ఓదార్చుతూ చైతన్యాన్ని నింపేవాడు. అలాంటి లక్ష్మణుడు వెళ్లిపోతున్నాడు. లక్ష్మణుడి మాట వినిపించని మరుక్షణం తను కూడా జీవించి లేనట్టే అనుకుంటూ వేదనకి లోనవుతాడు. అదే సమయంలో కాలి నడకన సరయూ నదీ తీరానికి వెళ్లిన లక్ష్మణుడు, అలా ఆ నదిలో నడచుకుంటూ వెళుతూ శరీరాన్ని వదిలి స్వర్గానికి చేరుకుంటాడు.

ఇక రాముడు కూడా తన శరీరాన్ని వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ లోగా ఒక ప్రభువుగా తన బాధ్యతలను పూర్తిచేయాలని అనుకుంటాడు. వశిష్ఠ మహర్షికి తన నిర్ణయాన్ని గురించి తెలియజేస్తాడు. అలాగే పాలనా సంబంధమైన విషయాలను గురించి భరత శత్రుఘ్నులతో చర్చిస్తాడు. తాను నిర్దేశించిన రాజ్యాలకు రాజులుగా లవకుశులకు పట్టాభిషేకం జరిపిస్తాడు. ఆ తరువాత ఎవరిపట్ల ఎలాంటి వ్యామోహం లేకుండా సరయూ నదికి చేరుకుంటాడు. ఆ నదిలోకి అలా నడుస్తూ వెళుతూనే రామావతారాన్ని చాలించి వైకుంఠానికి చేరుకుంటాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 100 : End of Lord Rama avatar

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: