Ramayanam – 99 : Lakshmana broke rules

యమధర్మరాజు చెప్పిన మాటలు అన్నీ వినేసిన రాముడు, బ్రహ్మ సూచన మేరకు తాను వైకుంఠానికి తిరిగి రాగలనని చెబుతాడు. త్వరలోనే రామావతార పరిసమాప్తం చేసి రాగలనని తన మాటగా బ్రహ్మకు చెప్పమని అంటాడు. అదే సమయంలో దుర్వాసుడు తన సోదరుడిని శపిస్తాడేమోననే ఆందోళనతో, తన ప్రాణాలకి ప్రమాదమని తెలిసి కూడా లక్ష్మణుడు లోపలికి వచ్చేస్తాడు. రహస్య మందిరంలోకి లక్ష్మణుడు రావడం చూసి రాముడు బిత్తరపోతాడు. నియమ ఉల్లంఘన జరిగిందని చెప్పేసి యమధర్మరాజు వెళ్లిపోతాడు.

ఆ తరువాత దుర్వాసుడు వచ్చాడనే విషయం రాముడికి చెప్పేసి, ఆయనను లోపలికి పంపిస్తాడు లక్ష్మణుడు. దుర్వాసుడు రాముడిని కలుసుకుని మాట్లాడి వెళ్లిపోతాడు. లక్ష్మణుడు నియమాన్ని ఉల్లఘించడం గురించే రాముడు ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన కళ్ల వెంట అశ్రువులు ధారకడుతూ ఉంటాయి. రాముడి కన్నీళ్లు తాను చూడలేననీ, తమ్ముడి విషయంలో రాముడు ధర్మం తప్పాడనే మాట కూడా తాను వినలేనని లక్ష్మణుడు అంటాడు. అందువలన ఎలాంటి ఆలోచన చేయకుండా, ఆలస్యం చేయకుండా తనని సంహరించమని కోరతాడు.

రాముడు మౌనంగా వేదన చెందుతూ ఉంటాడు. రాముడి కారణంగా ధర్మం రక్షించబడుతుందనే ఉద్దేశంతో, తాను ఆయనకు సహకరిస్తూ వచ్చాననీ, కానీ తన కారణంగా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఒకటి ఏర్పడుతుందని తాను ఊహించలేదని అంటాడు. రాముడు తన కారణంగా మాట తప్పడమనే పరిస్థితి వస్తే తానే ఉండనని చెబుతాడు. అందువలన తనని క్షమించి వదిలేసే ఆలోచన చేయవద్దని కోరతాడు.

దాంతో రాముడు తేరుకుంటాడు .. మహర్షికి ఇచ్చిన మాటను ఉల్లంఘించినందుకు ప్రాణాలు తీయవలసిన పనిలేదనీ, ఇక తాను అతణ్ణి ఎప్పటికీ వదిలేస్తున్నాని అంటాడు. ప్రాణసమానమైన తన సోదరుడు తనని విడిచిపెట్టడమంటే ఇక తాను మరణించినవాడితో సమానమే. తాను బ్రతికి ఉన్నప్పటికీ రాముడు తనవైపు చూడడు .. మాట్లాడడు .. పట్టించుకోడు. అలాంటప్పుడు తనకు జీవించడం కంటే మరణించడమే మంచిదనే నిర్ణయానికి లక్ష్మణుడు వస్తాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 99 : Lakshmana broke rules

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: