Ramayanam – 76 : Golden Sita idea
నిరంతరం రాముడు, సీతను గురించే ఆలోచన చేస్తూ ఉంటాడు. రాజ్యంలో ప్రజలు కరవు కాటకాల కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఆ సమస్యలను రాముడి వరకూ తీసుకెళ్లే సాహసాన్ని ఎవరూ చేయలేకపోతుంటారు. ఒక వైపున రాజ్యం, మరో వైపున రాముడు గురించి కౌసల్యాదేవి వేదన చెందుతుంది. ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని సూచిస్తారనే ఉద్దేశంతో, వశిష్ఠ మహర్షి .. ఋష్యశృంగ మహర్షికి కబురు చేస్తుంది. రాముడి సోదరియైన శాంతను వెంటబెట్టుకుని ఋష్యశృంగుడు, ఆ వెనుకే వశిష్ఠుడు అక్కడికి వస్తారు.
అయోధ్య పరిస్థితిని గురించి వాళ్లకి కౌసల్యాదేవి వివరిస్తుంది. సీతకు సంబంధించిన ఆలోచనలో నుంచి రాముడు బయటపడటానికీ, అయోధ్య కరవు కాటకాల నుంచి బయటపడటానికి తగిన తరుణోపాయాన్ని గురించి చెప్పమని కోరుతుంది. “అశ్వమేథ యాగం” చేయడం వలన అన్ని రకాల అనర్థాలు తొలగిపోతాయనే అభిప్రాయాన్ని వశిష్ఠ మహర్షి వ్యక్తం చేస్తాడు. యాగ ఫలితం కారణంగా రాముడి మనసుకు ఊరట లభించడం, రాజ్యం సుభిక్షం కావడం జరుగుతుందని అంటాడు.
సీతాదేవి లేకుండా యాగం ఎలా జరుగుతుందనే అనుమానాన్ని రాముడు వ్యక్తం చేస్తాడు. ఆయన మరో పెళ్లి చేసుకుంటే యాగం చేయడానికి తగిన అర్హత లభిస్తుందని రాముడి సోదరి, ఋష్యశృంగుడి భార్య అయిన శాంత తన అభిప్రాయం చెబుతుంది. ఆమె ఆ మాట అనగానే రాముడు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. రాముడు ఏకపత్ని వ్రతుడనే విషయాన్ని మరిచిపోవద్దని చెబుతాడు. ఎలాంటి పరిస్థితుల్లోను తనకి మరో పెళ్లి అనే విషయాన్ని గురించిన ఆలోచన చేయవద్దని అంటాడు. రాముడు – సీత శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటేనని చెబుతాడు.
రాముడు అలా ఉద్వేగానికి లోనవుతూ ఉండగా, వశిష్ఠ మహర్షి జోక్యం చేసుకుంటాడు. ఈ సమస్యకి మరో పరిష్కారం ఉందని అంటాడు. బంగారు సీత విగ్రహం చేయించి, ఆ మూర్తిని పక్కన ఉంచి యాగాన్ని నిర్వహించవచ్చని చెబుతాడు. ఈ విధంగా చేయడం వలన, ధర్మపత్నిని పక్కన పెట్టుకుని యాగం చేసిన ఫలితమే లభిస్తుందని అంటాడు. ఈ మార్గాన్ని అనుసరించడమే అన్ని విధాలా మంచిదనే అభిప్రాయాన్ని ఋష్యశృంగుడు వ్యక్తం చేస్తాడు. అందుకు రాముడు తన అంగీకారాన్ని తెలియజేయడంతో, ఆ క్షణం నుంచే సన్నాహాలు మొదలవుతాయి.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 76 : Golden Sita idea
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.