Ramayanam – 75 : Lavanasura death

లవణాసురుడు ఎలాంటివాడు .. ఎంతటి పరాక్రమవంతుడు .. ఆయన దగ్గర గల శూలం ఎంతటి శక్తిమంతమైనది అనే విషయాలను ముందుగానే తెలుసుకున్న శత్రుఘ్నుడు, ఆయన నివాస ద్వారానికి అడ్డుగా నిలబడతాడు. అడవికి వేటకి వెళ్లిన లవణాసురుడు తిరిగి నివాసానికి చేరుకుంటూనే శత్రుఘ్నుడిని చూస్తాడు. వచ్చింది రాముడి సోదరుడు అని తెలుసుకున్న లవణుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు.

రావణుడు తనకి దగ్గర బంధువు అనీ, ఆయనను సంహరించిన రాముడి సోదరుడిని వదిలే ప్రసక్తే లేదని అంటాడు. ప్రాణాలపై ఆశ లేకపోవడం వల్లనే తనని వెతుక్కుంటూ వచ్చావంటూ, లోపలికి వెళ్లి తన శూలం తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆయనను శత్రుఘ్నుడు అడ్డగిస్తాడు. దాంతో భుజబలంతో శత్రుఘ్నుడిపై లవణుడు విరుచుకుపడతాడు. ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతుంటుంది.

ఒక వైపున శత్రుఘ్నుడిపై పోరాటం చేస్తూనే, ఏ మాత్రం అవకాశం చిక్కినా లోపలికి వెళ్లి తన శూలం తెచ్చుకోవడానికి లవణుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ విషయం ముందుగానే తెలిసి ఉండటం వలన, ఆయనకి ఎంతమాత్రం అవకాశం దక్కకుండా చేస్తుంటాడు శతృఘ్నుడు. ఆయన బాణాలు నుంచి లవణుడు తప్పించుకుంటూ, పెద్ద పెద్ద బండరాళ్లను విసరడం మొదలుపెడతాడు. మహా వృక్షాలను పెకిలించి తెచ్చి దాడి చేస్తూ ఉంటాడు.

లవణుడు మెరుపు వేగంతో చేస్తున్న దాడి కారణంగా ఆయన ఎంత బలవంతుడనే విషయం శత్రుఘ్నుడికి అర్థమైపోతుంది. అతికష్టం మీద శత్రుఘ్నుడు తప్పించుకుంటూ శక్తిమంతమైన అస్త్రాలను ప్రయోగిస్తూనే ఉంటాడు. లవణుడు చేసిన దాడి కారణంగా బలంగా గాయపడిన శత్రుఘ్నుడు ఒక్కసారిగా స్పృహ తప్పుతాడు. ఆ దెబ్బకి ఆయన చనిపోయాడని లవణుడు అనుకుంటాడు. అందువలన తన శూలాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయడు. అంతలో తేరుకున్న శత్రుఘ్నుడు వైష్ణవ అస్త్రం ప్రయోగించడం, లవణుడు అంతం కావడం ఒక్కసారిగా జరిగిపోతాయి.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 75 : Lavanasura death

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: