Ramayanam – 36 : Hanuman caught with Indrajit Brahmastra

లంకానగరంలోకి ఒక మహావానరం ప్రవేశించిందనీ, అది కనబడిన వాళ్లను కనబడినట్టుగానే హతమారుస్తుందనే విషయం తెలిసి రాక్షస గణాలు భయపడిపోతాయి. అదే సమయంలో ఆ వానరాన్ని ఎదిరించడానికి వెళ్లిన జంబుమాలి దాని చేతిలో మరణించడం వాళ్లను మరింత భయకంపితులను చేస్తుంది. జంబుమాలి చనిపోయాడని తెలియగానే రావణుడి కుమారుడైన అక్ష కుమారుడు తీవ్రమైన ఆగ్రహావేశాలకు లోనవుతాడు. వెంటనే అస్త్రాలను ధరించి ఆ వానరాన్ని వెదుకుతూ వెళతాడు. అక్షకుమారుడికి, హనుమంతుడికి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. ఆ పోరాటంలో అక్ష కుమారుడు చనిపోతాడు.

తన కుమారుడు చనిపోయాడనే విషయం తెలియగానే రావణుడు ఉగ్రుడవుతాడు. తండ్రి కోపాన్ని ఆదేశంగా అర్థం చేసుకున్న మరో కుమారుడైన ఇంద్రజిత్తు వెంటనే తన రథంపై బయల్దేరుతాడు. ఆ వానరాన్ని సంహరించవద్దనీ, బంధించి తీసుకురమ్మని రావణుడు ఆయనను ఆదేశిస్తాడు. ఎంతో అందమైన వనాలు ధ్వంసమై ఉండటం చూస్తూ రథంపై ఇంద్రజిత్తు ముందుకు వెళుతూ ఉంటాడు. ఆ వానరం ఎక్కడ ఉందో గమనిస్తూ సాగుతుంటాడు. తన రథం చేసే చప్పుడికి ఆ వానరం భయపడి ఎక్కడో దాక్కుని ఉంటుందని భావిస్తాడు.

కానీ ఆ వనాల్లో ఒక చోటున హాయిగా కూర్చుని ఉన్న వానరాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. రాక్షస గణాలు ఆ వానరం యొక్క ఆకారాన్ని గురించి చెబుతూ ఉంటే అతిశయోక్తి అనుకున్నాను గానీ, వాళ్ల మాటల్లో నిజం ఉందని అనుకుంటాడు. తాను కూడా ఇంతవరకూ ఇంత పెద్ద వానరాన్ని చూడలేదని అనుకుంటాడు. ఇంతటి విధ్వసం సృష్టించిన ఈ వానరం ఇంత తాపీగా ఎలా ఉండగలుతుందా అని ఆశ్చర్యపోతాడు. ఇక ఆలస్యం చేయకుండా తన బాణాలతో ఆ వానరాన్ని భయపెట్టి బంధించాలని భావిస్తాడు.

ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఇంద్రజిత్తు అస్త్రాల ధాటి నుంచి హనుమంతుడు తెలివిగా తప్పించుకుంటూ ఉంటాడు. మహా మాయావి అయిన తన ముందే ఆ వానరం దోబూచులాడుతూ ఉండటం ఆయనకి విస్మయాన్ని కలిగిస్తుంది. తన ఆయుధాలు ఒక్కొక్కటిగా వృథా అవుతుండటంతో ఆయన అసహనానికి లోనవుతాడు. ఇక బ్రహ్మాస్త్రమే సరైనదని భావించి, దానిని వదులుతాడు. హనుమంతుడు బ్రహ్మాస్త్రాన్ని గౌరవిస్తూ బంధించబడతాడు. అలా బందీ అయిన హనుమంతుడిని తీసుకుని ఇంద్రజిత్తు గర్వంగా వెనుదిరుగుతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 36 : Hanuman caught with Indrajit Brahmastra

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: