Ramayanam – 37 : Hanuman gives advise to Ravana

రావణుడు తన సభామందిరంలో సభికుల సమక్షంలో ఆశీనుడై ఉంటాడు. ఆయనకి ఎదురుగా హనుమంతుడిని తీసుకెళ్లి నిలబెడతాడు ఇంద్రజిత్తు. తన కుమారుడి పరాక్రమం గురించి తనకి తెలుసని అన్నట్టుగా హనుమంతుడి వైపు చూస్తాడు రావణుడు. అది గమనించిన హనుమంతుడు, తాను బ్రహ్మాస్త్రంను గౌరవించి లొంగిపోయానేగానీ, తనని బంధించడం ఎవరివలనా కాదని అంటాడు. ఇంతటి బలిష్టమైన వానరాన్నీ అందునా మాటలు నేర్చిన వానరాన్ని తాను చూడలేదని రావణుడు హేళన చేస్తాడు.

చేయరాని పనులు చేస్తున్నప్పుడు, జరగరాని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇలాంటి చిత్రాలు చూడవలసి వస్తుందని హనుమంతుడు అంటాడు. తాను రాముడి దూతగా వచ్చాననీ, దూతను గౌరవించకపోవడం లంకానగర సంప్రదాయమని తెలిసిందని చెబుతాడు. తనంతటివారు తన సన్నిహితులకు తప్ప తన ఎదురుగా కూర్చునే అవకాశం ఎవరికీ ఉండదని రావణుడు అంటాడు. నాలుగు గోడల మధ్య సింహాసనం వేసుకుని కూర్చుని తనంతటి గొప్పవాడు లేడని అనుకుంటే, అంతటి అవివేకము మరొకటి ఉండదని హనుమంతుడు అంటాడు.

రావణుడు శివభక్తుడని తాను విన్నాననీ, అలాంటివాడు పరస్త్రీని అపహరించి తీసుకురావడం మర్యాదకాదని హనుమంతుడు చెబుతాడు. రాముడు తన భార్యను అన్వేషిస్తూ బయల్దేరాడనీ, ఆయన సముద్రం దాటి రాకమునుపే సీతమ్మవారిని అప్పగించడం మంచిదని అంటాడు. లేదంటే రాక్షస జాతి అంతా కూడా నశిస్తుందని చెబుతాడు. రాముడికి అండగా వానర సైన్యం ఉందనీ, ఆ సైన్యం లంకానగరాన్ని నామరూపాలు లేకుండగా చేస్తుందని అంటాడు. రాముడి పాదాలను ఆశ్రయించి క్షమాపణలు కోరకపోతే, ఈ విషయంలో అతణ్ణి ఎవరూ కాపాడలేరని హితవు చెబుతాడు.

హనుమంతుడి మాటలకు రావణుడు పెద్దగా నవ్వుతాడు. వానర సైన్యాన్ని వెంటేసుకుని వచ్చే రాముడు తనని ఏమీ చేయలేడని అంటాడు. చీమలబారువంటి వానర సైన్యాన్ని చూసి రావణుడు బెదిరేరకం కాదని చెబుతాడు. దేవతలను ఎదిరించిన తాను సాధారణమైన మానవులకు భయపడతానని అనుకోవడం ఆ వానరుడి అమాయకత్వానికి నిదర్శనమని అంటాడు. సముద్రం దాటి లంకానగరంలోకి ప్రవేశించిన ఏ ఒక్కరూ తిరిగి ప్రాణాలతో వెళ్లలేరని, ఆ విషయాన్ని కనులారా చూసి తెలుసుకోమని చెబుతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 37 : Hanuman gives advise to Ravana

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: