Ramayanam – 39 : Hanuman set fire to Lanka

సీతాదేవి విషయంలో హనుమంతుడు ఎంతగా హితవు చెప్పినా రావణుడు వినిపించుకోడు. పైగా హనుమను సంహరించమని రాక్షస గణాలను ఆదేశిస్తాడు. అందుకు విభీషణుడు అడ్డుపడటం వలన ఆగుతాడు. హనుమంతుడిని ఏమీ చేయకుండా తిరిగి పంపించడం ఇష్టం లేక, ఆయన తోకకు నిప్పు అంటించమని సైనికులను ఆదేశిస్తాడు. విభీషణుడు ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా, రావణుడి సైనికులు హనుమంతుడి తోకకు నిప్పు అంటిస్తారు. తన తోకకి నిప్పు అంటించిన మరుక్షణమే, హనుమంతుడు భయాందోళనలతో పారిపోతాడని అనుకుంటారు.

కానీ తన తోకకి నిప్పు అంటించగానే హనుమంతుడు ఆ నిప్పును లంకా నగరంలోని భవనాలకు, ఇతర నివాసాలకు అటించడం మొదలు పెడతాడు. చూస్తుండగానే భవనాలు తగల బడుతూ ఉంటాయి. రాక్షసులు అంతా కూడా ఎవరికి తోచిన దిక్కుకు వారు పరుగులు పెడుతూ ఉంటారు. ఏం జరుగుతుందో తెలియని అయోమయానికి రావణుడు లోనవుతాడు. దూరం నుంచి ఎగసి పడుతున్న మంటలను సీతమ్మవారు చూస్తుంది. రాక్షసుల గగ్గోలును వింటుంది. హనుమ తోకకు నిప్పు అంటించారని తెలుసుకుని, ఆయనను బాధించవద్దని అగ్నిదేవుడికి నమస్కరించుకుంటుంది.

సీతమ్మ ప్రార్ధన కారణంగా హనుమంతుడికి తోక కాలడం వలన ఎలాంటి బాధ అనిపించదు. దాంతో ఆయన తాను చేయవలసిన కార్యాన్ని తాపీగా చేసేస్తాడు. సీతమ్మవారు ఉన్న ప్రదేశాన్ని తప్పించి ఆయన ధ్వంసం చేయనిదేదీ లేకుండా పోతుంది. తాను వద్దన్న పని చేసినందుకు రావణుడి వైఖరి పట్ల విభీషణుడు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. ఆయన చెప్పడం వలన ఆ వానరాన్ని వదిలేశాననీ, అందువల్లనే ఇలా జరిగిందని రావణుడు మండిపడతాడు. ఇద్దరూ కూడా మాటా మాటా అనుకుని విసురుగా తమ భవనాలకు వెళ్లిపోతారు.

హనుమంతుడు ఒకసారి లంకానగరంలోని భవనాలపై ప్రదక్షిణ మార్గంలో తిరుగుతూ, ఎక్కడెక్కడ ఏమేం ఉన్నాయో అంతా క్షుణ్ణంగా పరిశీలించి, సీతమ్మవారి దగ్గర సెలవు తీసుకుని బయల్దేరతాడు. సుగ్రీవుడు నాలుగు దిక్కులకు పంపించిన వానరులలో మూడు దిక్కుల నుంచి వానరులు తిరిగి వచ్చేస్తారు. దక్షిణ దిక్కుగా వెళ్లిన హనుమ తదితరులు తిరిగి రాకపోవడంతో రామలక్ష్మణులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. హనుమంతుడు ఏ సమాచారంతో తిరిగివస్తాడా అని వాళ్లు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 39 : Hanuman set fire to Lanka

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: