Ramayanam – 38 : Ravana angry on Hanuman

సీతమ్మతల్లిని శ్రీ రాముడికి అప్పగించి శరణు కోరమనీ, కోరి వినాశనాన్ని కొని తెచ్చుకోవద్దని రావణుడిని హనుమంతుడు హెచ్చరిస్తాడు. ఆయన ఎన్ని విధాలుగా చెప్పినా రావణుడు వినిపించుకోడు. అసలు ఒక వానరాన్ని వధించకుండా ఉపేక్షించడమే తాము చేసిన తప్పు అని రావణుడు అంటాడు. అందువల్లనే ఆ వానరంతో నీతులు చెప్పించుకోవలసి వస్తుందని అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. రావణుడికి ఎదురుగా నిలబడి ఎదిరించి మాట్లాడినవాడు ఇంతవరకూ లేడని ఆగ్రహిస్తాడు.

తన లంకానగరంలోకి ప్రవేశించి తనవారి ప్రాణాలను తీసిన వానరం విషయంలో ఇక ఆలస్యం చేయవద్దనీ, వెంటనే దాని ప్రాణాలు తీయమని ఆదేశిస్తాడు. అందుకు సిద్ధమైన రాక్షస వీరులతో విభీషణుడు వారిస్తాడు. దూతగా వచ్చిన వారిని సంహరించకూడదనే రాజనీతిని గుర్తుచేస్తాడు. హనుమంతుడు తమవారి ప్రాణాలు తీయడం సరైనది కాకపోయినా, దూతగా వచ్చాడు గనుక, ఆయనను సంహరించడం న్యాయం కాదని చెబుతాడు. తమ బలాబలగాలను గురించి రాముడికి తెలియాలంటే, హనుమ అక్కడికి ప్రాణాలతో వెళ్లాలని అంటాడు.

విభీషణుడి మాటలు రావణుడిని ఆలోచింపజేస్తాయి. హనుమంతుడు తన సైనిక బలాలను చూశాడు. ఇక్కడ రాక్షస వీరులు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకున్నాడు. తమవారి దగ్గర ఎలాంటి అస్త్రాలు ఉన్నాయన్నది తెలుసుకున్నాడు. ఈ విషయాలన్నీ ఆయన రాముడికి చెప్పడం వలన ఆయన ధైర్యంతో ముందడుగువేసే సాహసం చేయకపోవచ్చని భావిస్తాడు. అందువలన హనుమంతుడిని అంతం చేయించాలనే నిర్ణయానికి స్వస్తి చెబుతాడు. దాంతో విభీషణుడి మనసు తేలికపడుతుంది.

అంతలోనే దూతను ప్రాణాలు తీయవద్దని చెప్పారేగానీ, తగిన బుద్ధి చెప్పవద్దని ఎక్కడా లేదే అంటూ రావణుడు ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ వానరుడు ఇంతవరకూ ఎవరూ ప్రవేశించని లంకానగరంలోకి వచ్చాడు. రాక్షస గణాలనే భయపెట్టాడు. అలాగే అందమైన ఉద్యానవనాలను నాశనం చేశాడు. తన ఎదురుగ నిలబడి సవాల్ చేస్తూ మాట్లాడాడు. తన పరాక్రమాన్ని తక్కువ చేస్తూ హెచ్చరించాడు. అందువలన అతని తోకకు నిప్పుపెట్టమని ఆదేశిస్తాడు. ఇక భవిష్యత్తులో ఇటువైపుగా రావాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఇదే గుణపాఠమని అంటాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 38 : Ravana angry on Hanuman

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: