Ramayanam – 26 : Jatayu confronts Ravana

రామలక్ష్మణులు ఆశ్రమంలో లేని సమయంలో రావణుడు మారువేషంలో వచ్చి సీతాదేవిని అపహరిస్తాడు. ఆమె నిలుచున్న మట్టి దిమ్మతో సహా పెకిలించి తీసుకుని ఆకాశమార్గాన వెళుతుంటాడు. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో సీతాదేవి కేకలు వేస్తుంది. తనని కాపాడమంటూ భయంతో అరుస్తుంది. ఆ కేకలు “జటాయువు” అనే పక్షిరాజుకు వినిపిస్తాయి. దాంతో ఆ జటాయువు ఒక్కసారిగా రావణుడిపై దాడి చేస్తుంది. ఊహించని ఈ పరిణామానికి రావణుడు నివ్వెరపోతాడు. ఆ పక్షిరాజు తన పొడవైన ముక్కుతో, కాళ్ల గోర్లతో రావణుడిని గాయపరుస్తూ ఉంటుంది.

భారీ ఆకారంలో దాడి చేస్తున్న ఆ పక్షిరాజును నియంత్రించడం రావణుడికి కష్టమవుతుంది. పదే పదే తనని గాయపరుస్తున్న జటాయువుపై తన ఖడ్గాన్ని ప్రయోగిస్తాడు. తన ఖడ్గంతో దాని రెండు రెక్కలను నరికేస్తాడు. దాంతో జటాయువు బాధతో అరుస్తూ ఆకాశంలో గింగిరాలు తిరుగుతూ కుప్పకూలుతుంది. తన కోసం పోరాడి ప్రాణాల మీదకి తెచ్చుకున్న జటాయువును చూసి సీతాదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది. జటాయువు పడిపోయిన వైపుకే చూస్తూ, ఆమె కుమిలిపోతూ ఉంటుంది. సీతాదేవిని రక్షించలేకపోయినందుకు బాధపడుతూ, జటాయువు కొన ప్రాణాలతో కొట్టుకుంటూ ఉంటుంది.

లక్ష్మణుడితో ఆశ్రమానికి తిరిగివచ్చిన రాముడు, సీతాదేవి ఎక్కడా కనిపించకపోవడంతో ఆందోళన చెందుతాడు. ఆమె తరచుగా తిరుగాడే ప్రదేశాలకు ఆత్రుతగా వెళ్లి వెదుకుతాడు. ఆశ్రమ ప్రాంగణంలో ఒకచోట మట్టి పలక పెకిలించినట్టుగా ఉండటం చూసిన ఆయనకి అనుమానం వస్తుంది. ఆశ్రమం ఎప్పుడైతే కళ తప్పినట్టుగా కనిపించిందో అప్పుడే సీత అక్కడ లేదనే విషయం ఆయనకి అర్థమైపోతుంది. కానీ ఆశకొద్దీ చుట్టుపక్కల వెదుకుతాడు. ఇక ఇప్పుడు సీతను ఎవరో అపహరించారనే విషయం ఆయనకి స్పష్టమవుతుంది.

సీతలేని ఆశ్రమంలో, ఆ ప్రదేశంలో రాముడు ఒక్క క్షణ కాలం కూడా నిలవలేకపోతాడు. ఆమెతో గడిపిన మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంటాడు. ఫలానా చోటున సీత కూర్చుండేదనీ, ఫలానా చోటున ఆమె విశ్రమించేదనీ తనతో కబుర్లు చెబుతూ ఆమె ఫలానా ప్రదేశంలో నిలిచుండేదని తలచుకుని రాముడు ఆవేదన చెందుతాడు. ఆమె పెంచిన మొక్కలు, ఆమె పెంచిన పక్షులు, ఆమె వేసిన ముగ్గులు ఇలా అన్నీ సీతను జ్ఞాపకం చేస్తూ ఉండగా రాముడు కన్నీళ్ల పర్యంతమవుతాడు. ఇక ఆలస్యం చేయకుండా సీత జాడ తెలుసుకోవాలంటూ లక్ష్మణుడితో కలిసి బయల్దేరుతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 26 : Jatayu confronts Ravana

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: