Ramayanam – 27 : Jatayu informs about Sita and dies

రావణుడు సీతను ఆకాశమార్గాన తన లంకా నగరానికి తీసుకువెళుతూ ఉంటాడు. తనని వదిలేయమని సీతాదేవి ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా ఆయన వినిపించుకోడు. అలా ఆకాశ మార్గాన వెళుతున్న ఆమెకి, తనని వెతుక్కుంటూ రాముడు వస్తాడనే విషయం అర్థమవుతుంది. ఆయనకి తన జాడ తెలియాలనే ఉద్దేశంతో, అనసూయాదేని తనకి బహుకరించిన నగలను ఒక్కక్కటిగా ఒలిచి క్రిందికి విడుస్తూ వెళుతుంది. అలా ఆమె వదిలిన కొన్ని ఆభరణాలు హనుమంతుడికి దొరుకుతాయి.

సీతాదేవిని ఎవరు అపహరించారో, ఎందుకు అపహరించారో, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియక రామలక్ష్మణులు అయోమయానికి లోనవుతారు. ఏదైనా ఆధారం దొరుకుతుందేమోననే ఉద్దేశంతో ఆమెను గురించి వెదకడం మొదలుపెడతారు. సీతా .. సీతా అంటూ రాముడు ఆ అడవుల్లో ముందుకు సాగుతుంటాడు. మౌనంగా ఆయనను లక్ష్మణుడు అనుసరిస్తూ ఉంటాడు. తన వదినను అపహరించినవారికి, తన అన్నను ఇంతగా అవస్థలపాలు చేసిన వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో లక్ష్మణుడు రగిలిపోతుంటాడు.

అలా రామలక్ష్మణులు అడవులలో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎక్కడా కూడా విశ్రాంతి అనేది తీసుకోకుండా పరుగువంటి నడకతో ముందుకు సాగుతుంటారు. అలా కొంతదూరం వెళ్లిన రామలక్ష్మణులకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ జటాయువు కనిపిస్తుంది. రాముడి చూడగానే జటాయువు తన జన్మధన్యమైందని అంటుంది. సీతాదేవిని లంకాధిపతి అయిన రావణుడు అపహరించాడనీ, అతన్ని అడ్డుకోబోగా తన రెక్కలను నరికివేశాడని చెబుతుంది. రావణుడు దక్షిణ దిశగా వెళ్లాడని చెప్పి తన ప్రాణాలను వదులుతుంది.

సీతాదేవిని ఎవరు అపహరించారు? ఆమెను అతను ఏ దిశగా తీసుకువెళ్లాడు? అనే ప్రశ్నలకు జటాయువు ద్వారా సమాధానం దొరకడంతో రాముడి మనసు ఊరడిల్లుతుంది. ఇక సీతాదేవిని దక్కించుకోగలననే నమ్మకం ఏర్పడుతుంది. తనకి ఇంతటి సాయం చేసిన జటాయువుకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఆ పక్షిరాజుకు అంత్యక్రియలు నిర్వహించి అక్కడి నుంచి బయల్దేరతారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 27 : Jatayu informs about Sita and dies

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: