Ramayanam – 12 : Keikeyi wish

రాముడికి పట్టాభిషేకం అనే విషయం తెలిసిన దగ్గర నుంచి కైకేయి భరతుడి గురించి ఆలోచిస్తోందనే విషయం దశరథుడికి అర్థమవుతుంది. దాంతో ఆయన భరతుడికి ఎలాంటి అన్యాయం జరగదనీ, అతని కోసం ఏం చేయాలో చెప్పమని అడుగుతాడు. గతంలో రెండు వరాలను కోరుకోమని తనను ఆయన అడిగిన విషయాన్ని గురించి గుర్తుచేస్తుంది. ఆ రెండు కోరికలను నెరవేర్చితే చాలని అంటుంది. సూర్యవంశానికి చెందినవారెవరూ ఆడినమాట తప్పరనీ, ఆ కోరికలేమిటో చెప్పమని దశరథుడు అడుగుతాడు.

రాముడు రాజైతే తన కుమారుడైన భరతుడు అతని సేవకుడిగా కాలాన్ని గడపవలసి వస్తుందని కైకేయి అంటుంది. తన కుమారుడిని తాను సేవకుడిగా చూడాలని అనుకోవడం లేదని చెబుతుంది. ఏ మహారాణి అయినా తన కుమారుడిని సింహాసనంపైన చూడాలని ముచ్చటపడుతుందేగానీ, సేవకుడిగా చూసి మురిసిపోవాలనుకోదని అంటుంది. తనకి జన్మించడమే తన కుమారుడు చేసిన పాపం కాదనీ, అందుకుగాను జీవితాంతం అతను సేవకుడిగా ఉండిపోయేలా చేయాలనుకోవడం ధర్మం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది.

అందువలన తన కుమారుడైన భరతుడు అయోధ్య సింహాసనాన్ని అధిష్టించాలని కోరుతుంది. ఆ మాట వినగానే దశరథుడు ఒక్కసారిగా తూలిపడబోతాడు. తాను చూస్తున్నది కైకేయినేనా? ఇలా మాట్లాడుతున్నది ఆమెయేనా? అనే అయోమయానికి ఆయన లోనవుతాడు. తన కాళ్ల క్రింది నేల కదిలిపోతున్నట్టుగా అనిపించడంతో, అక్కడే ఉన్న ఆసనంపై వాలిపోతాడు. ఒక తల్లిగా భరతుడి భవిష్యత్తును గురించి ఆలోచించడం తప్పేమీ కాదనీ, ఒక తండ్రిగా అతని గురించిన ఆలోచన చేయవలసిన బాధ్యత దశరథుడికి ఉందని కైకేయి అంటుంది.

మసకబారుతున్న తన కళ్లను తుడుచుకుంటూ, లేని ఓపికను తెచ్చుకుంటూ దశరథుడు పైకిలేస్తాడు. మొదటి కోరిక వినేసి అలా అయిపోతే రెండవ కోరిక కోరనని అనుకోవద్దని కైకేయి అంటుంది. రెండవ కోరిక ఆయనకి మరింత బాధను కలిగించవచ్చనీ, అలా అని చెప్పేసి నెరవేర్చడం కుదరదని అనొద్దని చెబుతుంది. ఆడినమాట తప్పరనే విషయం తనకి తెలుసునని అంటుంది. రెండవ కోరిక ఏమిటి? అన్నట్టుగా ఆందోళనతో దశరథుడు ఆమెవైపు చూస్తాడు. రాముడు 14 ఏళ్ల పాటు వనవాసం చేయాలని కైకేయి కోరుతుంది. ఆ మాట వినగానే దశరథుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

Ramayanam – 12 : Keikeyi wish

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: