Ramayanam – 13 : Dasharatha sadness

రాముడు 14 సంవత్సరాల పాటు అడవులకు వెళ్లాలనీ, భరతుడిని రాజుగా చేయాలని కైకేయి పట్టుపడుతుంది. ఆ మాటలకు దశరథుడు ఎంతగానో దుఃఖిస్తాడు. రాముడిని వదిలిపెట్టి తాను ఉండలేననీ, రాముడు లేని రాజ్యంలో ప్రజలే ఉండలేరని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆమె మొదటి కోరిక తీర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతాడు. భరతుడికి రాజ్యాన్ని అప్పగిస్తాననీ, రాముడిని అడవులకు పంపాలనే కోరికను వెనక్కి తీసుకోమని కోరతాడు. అందుకు కైకేయి నిరాకరిస్తుంది. రాముడు రాజ్యంలో ఉండగా రాజుగా పట్టాభిషేకం చేసుకోవడానికి భరతుడు ఒప్పుకోడని అంటుంది. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది.

రాముడిని చూడకుండా, “రామా” అని పిలవకుండా తాను ఉండలేనని దశరథుడు అంటాడు. తన ప్రాణాలు రాముడిలోనే ఉన్నాయనీ, రాముడు అయోధ్యను వీడితే తన ప్రాణాలు తనని వీడిపోతాయని చెబుతాడు. “రామా” అని పిలవకుండా తాను ఒక్క నిమిషం కూడా ఉండలేననీ, తనకి అంతటి శిక్ష విధించవద్దని ఆవేదన చెందుతాడు. రాముడు ధర్మస్వరూపుడనీ ఆయన వల్లనే అయోధ్యలో వర్షాలు పడుతున్నాయనీ, పంటలు పండుతున్నాయని అంటాడు. రాముడు దూరమైతే అయోధ్యలో కరువుకాటకాలు ఏర్పడతాయని చెబుతాడు. అందువలన మరోసారి ఆలోచన చేయమని అంటాడు.

తాను అన్ని విషయాలను ఆలోచించుకునే మాట్లాడుతున్నాననీ, ఇక తనకి ఇచ్చిన మాటను తప్పాలో నిలబెట్టుకోవాలో ఆలోచించవలసినది ఆయనేనని కైకేయి అంటుంది. తనకి నచ్చజెప్పడానికి ప్రయత్నించకుండా, రాముడికి ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అనేది ఆలోచన చేయమని చెబుతుంది. రాముడికి పట్టాభిషేకం తలపెట్టిన తానే అందుకు భిన్నమైన మాటలను చెప్పలేనని దశరథుడు అంటాడు. రాముడిని అడవులకు వెళ్లమని చెప్పలేననీ, ఆ మాటను శిరసావహించి అతను వెనుదిరిగిన వెంటనే తనకి లోకం శూన్యమైపోతుందని కుమిలిపోతాడు.

అయితే రాముడికి ఆయన చెప్పవలసిన మాటలను తానే చెబుతానని అంటూ, అతనికి కబురు చేస్తుంది. రాముడితో తాను చెప్పవలసింది చెబుతానని అంటుంది. ఆ సమయంలో తన మాటలకు అడ్డుపడకుండా ఉంటే చాలని చెబుతుంది. పట్టాభిషేక మహోత్సవానికి సమయం దగ్గర పడుతుండటంతో, అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే రాముడు ఉంటాడు. అదే సమయంలో కైకేయి మందిరం నుంచి అతనికి కబురు వస్తుంది. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కైకేయి మందిరానికి రాముడు బయల్దేరతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 13 : Dasharatha sadness

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: