Ramayanam – 71 : Kausalya anxiety

రాముడు అయోధ్యలో ఉన్నాడనే మాటేగానీ, ఆయన మనసంతా సీతాదేవిని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తనతో పాటు 14 సంవత్సరాల పాటు అడవులలో తిరుగుతూ అష్టకష్టాలు పడిన సీతాదేవిని, తిరిగి అడవులకు పంపించినందుకు ఆయన కుమిలిపోతూ ఉంటాడు. ఆయన పరిస్థితి చూసి కౌసల్య కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల పరిస్థితి కూడా అంతే ఉంటుంది. అంతఃపురంలో సీతమ్మతల్లి లేని లోటును అందరూ అనుభవిస్తూ ఉంటారు. వశిష్ఠ మహర్షి సహా అందరూ వేదన చెందుతూనే ఉంటారు.

ఇక వాల్మీకీ ఆశ్రమంలో సీతాదేవి లోకపావని పేరుతోనే నడచుకుంటూ ఉంటుంది. అక్కడి వాతావరణానికి ఆమె అలవాటు పడిపోతుంది. ఆశ్రమవాసులు ఆమెను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. ఆమె నిండు చూలాలు కావడంతో, ఆమె దగ్గరే ఉంటూ అన్నీ చూసుకుంటూ ఉంటారు. రాముడిని, అత్తలను, తోడికోడళ్లను, అయోధ్యానగరాన్ని తలచుకుంటూ సీతాదేవి రోజులు గడుపుతూ ఉంటుంది. తనని గురించి రాముడు ఎంతగా బాధపడుతున్నాడోనని అనుకుంటూ ఉంటుంది.

రాముడితో సమానమైన బాధను కౌసల్యాదేవి అనుభవిస్తూ ఉంటుంది. గర్భవతి అయిన సీతాదేవి ఎక్కడ ఉన్నదో, ఏమైపోయిందో తెలియక ఆమె ఆందోళన చెందుతూ ఉంటుంది. సీతాదేవికి నెలలు నిండి ఉంటాయి, ఆమె కాన్పుకు మరెంతో సమయం లేదు. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఆమెకు అండగా ఎవరైనా ఉన్నారో లేదో అనుకుని కన్నీళ్ల పర్యంతమవుతుంది. అయోధ్య నగరంలో అంతఃపురంలో రాణిగా భోగాలను అనుభవించవలసిన సీతాదేవికి ఎంతటి కష్టకాలం వచ్చిందనుకుని ఆవేదన చెందుతుంది.

కౌసల్యాదేవి మాదిరిగానే రాముడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు. సీతాదేవి కాన్పు సమయంలో దగ్గర ఉండవలసిన తను ఎంతో నిర్దయగా ఆమెను పంపించివేయడాన్ని పదే పదే తలచుకుని తల్లడిల్లి పోతుంటాడు. సీతాదేవి వెళ్లిన దగ్గర నుంచి రాముడు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుంటాడు. పరిపాలనా సంబంధమైన విషయాలపై పెద్దగా ఆసక్తి చూపకపోవడం సోదరులను బాధిస్తుంది. రాముడు బాధపడుతుండటం కారణంగా అయోధ్యలో కరవు కాటకాలు ఏర్పడతాయి. దాంతో కౌసల్య మొదలు అంతా ఆలోచనలో పడతారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 71 : Kausalya anxiety

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: