Ramayanam – 72 : Chyavana maharshi seeks lord Rama’s help

ఓ రోజున రాముడు ఒంటరిగా కూర్చుని దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉండగా, ఆయన దగ్గరికి చ్యవన మహర్షి తన శిష్యులతో కలిసి వస్తాడు. ఆయనను చూడగానే రాముడు వినయంగా నమస్కరించి, సాదరంగా ఆహ్వానిస్తాడు. చ్యవన మహర్షి శిష్య బృందానికి అతిథి మర్యాదలు ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత చ్యవన మహర్షి రాకలోని ఆంతర్యం ఏమిటని అడుగుతారు. ఒక రాక్షసుడి కారణంగా తాము పడుతున్న బాధల నుంచి విముక్తిని కలిగించవలసిన బాధ్యత రాముడిదేనని చ్యవన మహర్షి అంటాడు.

రాముడు ఆయన వైపు ప్రశ్నార్థకంగా చూడటంతో, చ్యవన మహర్షి చెప్పడం మొదలుపెడతాడు. ఇంతకు ముందు మధువు అనే ఒక రాక్షసుడు మధుపురమును పాలించేవాడు. మహా శివభక్తుడైన ఆ మధువు, కఠోరమైన తపస్సును చేసి శివుడి నుంచి వరంగా మహా శక్తిమంతమైన శూలంను ఆయుధంగా పొందాడు. ఆ శూలాన్ని ఎవరూ ఎదిరించలేరు, అది ఆయన చేతిలో ఉండగా ఎవరూ జయించలేరు. ఎవరిపై ఆ శూలాన్ని ప్రయోగించినా అది వాళ్లను భస్మం చేసి తిరిగి వెనక్కి వస్తుంది.

అలాంటి శూలం తన వంశీకులందరికీ ఉపయోగపడేలా చూడమని మధువు కోరతాడు. అందుకు నిరాకరించిన శివుడు, మధువు తరువాత అతని కుమారుడి తరం వరకూ మాత్రమే ఆ శూలం పనిచేస్తుందని చెబుతాడు. అందుకు సంతృప్తి చెందిన మధువు అప్పటి నుంచి ఆ శూలాన్ని శివుడిగానే భావించి పూజిస్తూ వచ్చాడు. ఆ శూలం కారణంగానే శత్రువుల నుంచి ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. ఆ తరువాత ఆయనకి ఒక కుమారుడు జన్మించాడు, వాడిపేరే లవణుడు.

లవణాసురుడు యుక్తవయసులోకి వచ్చిన తరువాత, రాజ్యాధికారంతో పాటు శివప్రసాదమైన శూలాన్ని కూడా మధువు తన కుమారుడికి అప్పగించాడు. శూలం యొక్క మహిమను గురించి తెలిసిన దగ్గర నుంచి, లవణుడి ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. సాధుజనులను పీడిస్తూ, సమస్త జీవరాశిని భక్షిస్తూ భయాందోళనలు కలిగిస్తున్నాడు. ఆ అసురుడి బారి నుంచి తమని కాపాడవలసిన బాధ్యత రాముడికి అప్పగించాలనే ఉద్దేశంతోనే వచ్చామని చ్యవన మహర్షి చెబుతాడు. అక్కడే ఉన్న శత్రుఘ్నుడు ఆ కార్యాన్ని తాను పూర్తిచేస్తానని అంటాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 72 : Chyavana maharshi seeks lord Rama’s help

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: