Ramayanam – 97 : Lakshmana as dwarapalak

లక్ష్మణుడి వెంట వచ్చిన మహర్షిని రాముడు చూస్తాడు. ఆ మహర్షి దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతుంటాడు. సాధారణంగా తపోధనులు తేజస్సుతోనే ఉంటారు, కానీ ఈ మహర్షి మరింత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. చాలా ఏళ్లుగా తన దగ్గరికి ఎంతోమంది తాపసులు వచ్చారు దానధర్మాలు స్వీకరించి వెళ్లారు. వాళ్లలో ఎప్పుడూ కూడా ఈ మహర్షిని చూసిన గుర్తులేదు. ఎవరై ఉంటారు? అన్నట్టుగా రాముడు ఆలోచన చేస్తుంటాడు.

రాముడు అలా ఆలోచన చేస్తూ ఉండగా ఆ మహర్షి నేరుగా ఆయన కళ్లలోకి చూస్తాడు. ఆయన చూపుల్లో ఏదో మర్మం ఉందనే విషయాన్ని రాముడు గ్రహిస్తాడు. ఏదో బరువైన భారమైన సమాచారాన్నే ఆయన తీసుకుని వచ్చి ఉంటాడని రాముడు భావిస్తాడు. ఆ మహర్షి వేషధారణ మాటతీరు రాముడి సందేహాన్ని మరింత బలపరుస్తూ ఉంటాయి. ఎప్పుడూ లేనిది ఒక మహర్షిని గురించి తాను ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నట్టు? అనుకుంటూ రాముడు తనని తాను సవరించుకుంటాడు.

ఆ మహర్షికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ, వచ్చిన పని ఏమిటని రాముడు అడుగుతాడు. తాను ఒక ముఖ్యమైన కార్యంపై వచ్చానని ఆ మహర్షి చెబుతాడు. ఆ ముఖ్యమైన విషయాన్ని గురించి తాము మాట్లాడేటప్పుడు ఎవరూ అక్కడికి రాకూడదనీ, తమ మాటలు వారి చెవిన పడకూడదని అంటాడు. అలా వచ్చినవారిని రాముడు సంహరించవలసి ఉంటుందని చెబుతాడు. ఆ మాటలకు ఆ మహర్షి ఎదురుగా ఉన్న రాముడు, పక్కనే ఉన్న లక్ష్మణుడు ఆశ్చర్యపోతారు.

వచ్చింది ఎవరు? ఏ విషయాన్ని గురించి మాట్లాడాలనుకుంటున్నాడు? అనే విషయాన్ని గురించి క్షణకాలం పాటు ఆలోచించిన రాముడు, ఆయన అన్నట్టుగానే చేద్దామని చెబుతాడు. రహస్య మందిరంలో తాము సమావేశమవుదామనీ, అక్కడికి ఎవరూ వచ్చే అవకాశం ఉండదని రాముడు అంటాడు. సాధారణ కాపలాదారుడు కాకుండా, మహావీరుడైన తన తమ్ముడే ద్వారపాలకుడిగా ఉంటాడని చెబుతాడు. ఆ మాట వినగానే లక్ష్మణుడు వెళ్లి సింహద్వారం తలుపులు మూసేసి, ఆ ద్వారం దగ్గర కాపలాగా నిలబడతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 97 : Lakshmana as dwarapalak

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: