Ramayanam – 98 : Durvasa angry on Lakshmana

రాముడు తన దగ్గరికి వచ్చిన మహర్షిని రహస్య మందిరానికి తీసుకెళతాడు. ఆయన ఆశీనుడైన తరువాత, విషయమేమిటని అడుగుతాడు. తాను యమధర్మరాజుననీ, బ్రహ్మదేవుడి సందేశాన్ని వినిపించడానికి మారువేషంలో వచ్చానని ఆయన చెబుతాడు. ఆ మాట వినగానే రాముడు ఒక క్షణకాలం పాటు ఆశ్చర్యానికి లోనవుతాడు. అందువల్లనే ఆయన దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడని అనుకుంటాడు. చిరుమందహాసంతో ఆయన వైపు చూస్తూనే, తరువాత విషయం చెప్పమని అంటాడు.

శ్రీమహావిష్ణువే రావణ సంహారం కోసం శ్రీరాముడిగా అవతరించడం జరిగిందనీ, రావణ సంహారం తరువాత ఆయన అవతార కార్యం నెరవేరిందని బ్రహ్మదేవుడి మాటగా యమధర్మరాజు గుర్తుచేస్తాడు. అందువలన రామావతార కార్యాన్ని ముగించి, తిరిగి శ్రీమహావిష్ణువుగా వైకుంఠాన కొలువుదీరవలసిన సమయం ఆసన్నమైందని చెబుతాడు. ఒకవేళ రామావతార కార్యాన్ని మరింత పొడిగించుకోవలసిన అవసరం ఉంటే అది రాముడి నిర్ణయానికే వదిలివేయబడుతుందని అంటాడు. ఆ మాటకు రాముడు చిన్నగా నవ్వుతాడు.

అలా వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా, రాముడిని కలుసుకోవడానికి దుర్వాస మహర్షి వస్తాడు. ద్వారం దగ్గర లక్ష్మణుడు ఉండటం చూసి ఆయన ఆగిపోతాడు. తాను వెంటనే రాముడిని కలుసుకోవాలని లక్ష్మణుడితో చెబుతాడు. రాముడు ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాడనీ, ఇప్పుడు ఆయనను చూడటం కుదరదని లక్ష్మణుడు సున్నితంగానే చెబుతాడు. రాముడిని కలవడం కుదరదని చెప్పడం అంటే, అది ఒకరకంగా తనని అవమానించడమేనని దుర్వాసుడు అంటాడు. తనని లోపలికి పంపించకపోతే రాముడితో సహా అందరినీ శపిస్తానంటూ చిందులు వేస్తాడు.

దుర్వాసుడుర్వాసుడి ధోరణి లక్ష్మణుడికి తెలుసు, ఆయన మహా తపోబల సంపన్నుడు అన్నంత పనిచేయగల సమర్థుడు. అందువలన లక్ష్మణుడు ఆలోచనలో పడతాడు. రాముడిని కలుసుకోవడానికి తాను నిరాకరించడం లేదనీ, కొంతసేపు నిరీక్షించమని కోరుతున్నానని అంటాడు. ఎక్కడా ఎవరి కోసం వేచిచూసే అలవాటు తనకి లేదనీ, అయినా తాను ఉన్న పరిస్థితుల్లో అంత సమయం కూడా లేదని తొందర చేస్తాడు. అటు లోపల ఉన్న మహర్షి పెట్టిన నియమం .. ఇటు బయట శపిస్తానంటూ దుర్వాసుడి కోపం .. దాంతో లక్ష్మణుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 98 : Durvasa angry on Lakshmana

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: