Ramayanam – 95 : Lava Kusha goes to Ayodhya

రాముడు లవకుశులను వెంటబెట్టుకుని అయోధ్య నగరానికి తీసుకువస్తాడు. లక్ష్మణుడు – శత్రుఘ్నుడు కూడా వాళ్లను అనుసరిస్తూనే వస్తారు. వాళ్లు అంతఃపురములోకి అడుగుపెడుతూ ఉండగానే, రాముడి తల్లితోపాటు ఆయన పిన తల్లులు కూడా ఎదురుగా వస్తారు. సీతాదేవి తీసుకున్న నిర్ణయాన్ని గురించి తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. అంతకుముందు రామాయణ కథా కావ్యాన్ని గానం చేసింది, సీతారాముల పిల్లలే అని తెలిసి లవకుశులను అక్కున చేర్చుకుంటారు.

రాముడు అశ్వమేథయాగాన్ని పూర్తిచేస్తాడు. ఆ యాగం తరువాత చేయవలసిన దానధర్మాలను పూర్తి చేస్తాడు. లవకుశులకు తల్లిలేని లోటు తెలియకుండా కౌసల్యాదేవి చూసుకుంటూ ఉంటుంది. రాముడు మాత్రం సీతాదేవి గురించే ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆమె జ్ఞాపకాలతోనే కాలం గడుపుతూ ఉంటాడు. అంత బాధలోను ఆయన ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తన పాలనను కొనసాగిస్తూ ఉంటాడు. వశిష్ఠ మహర్షి ఒక వైపున రాముడిని కనిపెట్టుకుంటూనే, మరో వైపున లవకుశులను తీర్చిదిద్దుతూ ఉంటాడు.

కాలం గడిచిపోతూ ఉంటుంది, అయోధ్య సుభిక్షంగా ఉండటం కోసం రాముడు అనేక యజ్ఞయాగాలు నిర్వహిస్తాడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ లవకుశులు కూడా పెద్దవారవుతారు. వాళ్లు మహావీరులుగా ఎదిగారని తెలిసి రాముడు ఆనందిస్తాడు. అదే సమయంలో భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడి పిల్లలు కూడా ఎదుగుతారు. రాజ్యంలో ఎలాంటి కరువుకాటకాలు లేకుండా అయోధ్య ప్రజల జీవితం హాయిగా గడిచిపోతుంటుంది. వాళ్లంతా కూడా ధర్మం తప్పకుండా తమ కార్యాలను చక్కబెడుతూ ఉంటారు.

కాలక్రమంలో రాముడి తల్లి, పినతల్లులు గతిస్తారు. తాను దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో తనకి ధైర్యం చెబుతూ వచ్చిన తల్లి శరీరం వదిలేసినప్పుడు రాముడు ఎంతగానో దుఃఖిస్తాడు. పాలనా సంబంధమైన విషయాల్లో రాముడికి అంతకుముందులానే లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు తమ సహాయ సహకారాలను అందిస్తూనే ఉంటారు. లవకుశులు కూడా ప్రజల పట్ల ప్రేమతో మెలగుతుండటం చూసి రాముడు సంతృప్తి చెందుతాడు. తన తరువాత వాళ్లు రఘువంశ కీర్తి ప్రతిష్ఠలను కాపాడగలరనే విశ్వాసాన్ని పొందుతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 95 : Lava Kusha goes to Ayodhya

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: