Ramayanam – 94 : Lava Kusha says bye to Valmiki maharshi

రాముడి మనసును వాల్మీకి మహర్షి ఊరడిస్తాడు. లవకుశుల పరిస్థితుతిని ఆయనకి వివరిస్తాడు. పిల్లల విషయంలో సీతమ్మతల్లి తన ధర్మాన్ని ఎలా నిర్వర్తించిందనేది వివరిస్తాడు. సీతమ్మ కోసం ఆయనే అలా తల్లడిల్లిపోతే పిల్లల పరిస్థితి ఏమిటనేది ఆలోచన చేయమని అంటాడు. అయోధ్య వాసులు రాముడిపై, ఆయన పాలనపై ఎంతగా నమ్మకం పెట్టుకున్నది వివరిస్తాడు. ప్రభువుగా, తండ్రిగా ఆయన ఆచరించవలసిన ధర్మాలు ఇంకా ఉన్నాయని చెబుతాడు. లవకుశులను తీసుకెళ్లి ఆ ధర్మాన్ని నిర్వహించమని అంటాడు.

వాల్మీకి మహర్షి మాటలు రాముడి మనసుకు ఊరట కలిగిస్తాయి. నెమ్మదిగా ఆయన తేరుకుని లవకుశులను ఓదార్చుతాడు. వాల్మీకి మహర్షి ఆశ్రమం నుంచి వాళ్లు అయోధ్యకు రావలసి ఉంటుందని చెబుతాడు. దాంతో వాళ్లు వాల్మీకి మహర్షి పాదాలకి నమస్కరించుకుంటారు. పసి పిల్లల నుంచి వాళ్లను చూస్తూ వచ్చిన వాల్మీకి, కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎన్నో తపస్సులు చేసినా, అనురాగాన్ని ఆపుకోవడం కష్టమేనంటూ వేదన చెందుతాడు. వాళ్లు వెళ్లిపోతే తన ఆశ్రమం చిన్నబోతుందని అంటాడు.

తన ఆశ్రమ పరిసరాలలోని పక్షులు, సాధుజంతువులు సీతమ్మ ఏదన్నట్టుగా తనవైపు చూస్తే, వాటికి తాను ఏమని సమాధానం చెప్పాలని అంటాడు. రామయ్య నుంచి సీతమ్మ ఎప్పటికీ వేరు కాలేదనీ, ఆయన మనసు మందిరంలో ఆమె ఎప్పటికీ ఉంటుందని చెబుతాడు. అందువలన రామయ్య చూపించిన మార్గంలో నడుస్తూ, రఘువంశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురమ్మని అంటాడు. కర్తవ్య నిర్వహణలో అలసత్వం చూపరాదని హితవు చెబుతాడు.

చిన్నప్పటి నుంచి తమ పట్ల వాల్మీకి మహర్షి చూపిన ప్రేమానురాగాలను గుర్తుచేసుకుని లవకుశులు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆశ్రమవాసంలోని ఆనందాన్ని తమకి అందించిన ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. తమ తల్లి తమకి చెబుతూ వచ్చిన మాటలను ఎప్పటికీ మనసునందు నిలుపుకుని నడుచుకుంటామని చెబుతారు. తండ్రిమాట జవదాటమని అంటారు. అలా వాల్మీకి మహర్షికి మాట ఇచ్చిన లవకుశులు, తమ స్నేహితుల దగ్గర సెలవు తీసుకుని, రాముడి వెంట అయోధ్యకి నడుస్తారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 94 : Lava Kusha says bye to Valmiki maharshi

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: