Ramayanam – 74 Shatrugna happiness

లవణుడిని అంతం చేయడానికి బయల్దేరిన శతృఘ్నుడు, మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకోవాలని భావిస్తాడు. కాస్త దూరంగా వాల్మీకి ఆశ్రమం కనిపిస్తూ ఉండటంతో ఆ దిశగా వెళతాడు. ఆశ్రమంలో వాతావరణం అంతా సందడిగా ఉంటుంది. వాల్మీకి మహర్షికి నమస్కరించిన శత్రుఘ్నుడు, తాను ఏ కార్యంపై బయల్దేరింది చెప్పి, ఆ రాత్రికి అక్కడ ఉండాలనే ఉద్దేశంతో వచ్చానని అంటాడు. ఆ మాటలకు వాల్మీకి మహర్షి నవ్వి సమయానికే వచ్చావని అంటాడు. సీతమ్మతల్లి కవల పిల్లలను ప్రసవించిందని చెబుతాడు.

ఆ మాట వినగానే శత్రుఘ్నుడు ఆనందాశ్చర్యాలకు లోనవుతాడు. జరిగినదంతా వాల్మీకి మహర్షి ద్వారా విని ఆవేదన చెందుతాడు. సీతమ్మను చేరదీసి ఆదరించినందుకు వాల్మీకి మహర్షికి కృతజ్ఞతలు చెబుతాడు. తామంతా కూడా ఆయనకు ఎంతో రుణపడి ఉన్నామని అంటాడు. సీతమ్మను చూడరాదనేది రాముడు ఆదేశం కనుక, ఆమెను చూడటమనేది ఆయన ఆజ్ఞను ఉల్లంఘించడమే అవుతుందని శత్రుఘ్నుడు భావిస్తాడు. సీతమ్మ ఉన్న ఆశ్రమ సమీపానికి వెళ్లి బయట నుంచే ఆమెకి మనసులో నమస్కరించుకుంటాడు. ఆ తల్లి బిడ్డలను చల్లగా చూడమని దైవాన్ని కోరుకుంటాడు.

అనుకోకుండానే అయినా సమయానికి శత్రుఘ్నుడు రావడం పట్ల వాల్మీకి మహర్షి సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. విధి చాలా బలీయమైనదనీ, విచిత్రమైనదని శత్రుఘ్నుడితో అంటాడు. సీతాదేవి వనాలు చూడాలనుకోవడం .. అదే సమయంలో రాముడు ఈ నిర్ణయం తీసుకోవడం .. రామాయణం రాస్తున్న తనకి సీతమ్మ తారసపడటం .. ఆమె ప్రసవ సమయానికి అత్తింటి తరఫు నుంచి శత్రుఘ్నుడు రావడం .. ఇదంతా విధి చేసిన విచిత్రాలేనని చెబుతాడు. కాలప్రవాహంలో జరిగే మార్పులను అంగీకరిస్తూ ముందుకు సాగిపోవడమే జీవితమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు.

ఆ రాత్రికి వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకున్న శత్రుఘ్నుడు, ఆ మరుసటి రోజునే వాల్మీకి మహర్షి ఆశీస్సులు అందుకుని అక్కడి నుంచి బయల్దేరతాడు. అలా ఆయన మధుపురానికి చేరుకుంటాడు. లవణాసురుడికిగానీ, ఆయన అనుచరులకు గాని ఎలాంటి అనుమానం రాకుండా ఆయన నివాస ప్రాంతానికి చేరుకుంటాడు. ఆ సమయంలో లవణాసురుడు అడవికి వెళ్లి అక్కడి మృగాలను వేటాడి, వాటితో ఆకలి తీర్చుకుని తిరిగి వస్తుంటాడు. తన నివాస ద్వారానికి అడ్డుగా నిలబడినదేవరా అని ఆశ్యర్యంగా చూస్తాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 74 Shatrugna happiness

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: