Ramayanam – 5 : Maricha Subahu antics controlled

రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ ఉంటున్న ఆయన శిష్యులు రామలక్ష్మణులు ఉండటానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. ఆ తరువాత తాను తలపెట్టిన యాగాన్ని విశ్వామిత్రుడు మొదలుపెడతాడు. రామలక్ష్మణులు విల్లంబులు ధరించి యాగ రక్షణ చేయడం మొదలుపెడతారు. అలా యాగం జరుగుతూ ఉండగా, సూర్యుడి ప్రకాశం తగ్గినట్టుగా అనిపించి రామలక్ష్మణులు తమ తలలు పైకెత్తి చూస్తారు. ఆకాశంలో మేఘాల్లా మారీచ సుబాహులు కమ్ముకోవడం గమనిస్తారు.

ఎలాంటి పరిస్థితుల్లోను యాగాన్ని మధ్యలో ఆపే ప్రయత్నం చేయవద్దని విశ్వామిత్రుడితో చెప్పి, మారీచ సుబాహులపై విరుచుకుపడతారు. తమ తల్లిని చంపిన ఆ ఇద్దరూ మహా పరాక్రమవంతులై ఉంటారని గ్రహించిన మారీచ సుబాహులు, రాక్షస మాయతోనే యాగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రామలక్ష్మణులు వదులుతున్న బాణాలకు చిక్కకుండా తప్పించుకుంటూ ఉంటారు. గాల్లోనే ఆశ్రమం చుట్టూ తిరుగుతూ భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటారు. దాంతో వాళ్లపైకి రామలక్ష్మణులు వరుస బాణాలను సంధించి నేలకూలుస్తారు.

విశ్వామిత్రుడు తాను తలపెట్టిన యాగం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. రామలక్ష్మణుల పరాక్రమాన్ని అభినందిస్తాడు. అంతేకాకుండా జీవితంలో వాళ్లకి ఎక్కడ ఏ సమయంలోనైనా దివ్యాస్త్రాలు అవసరమవుతాయని భావించి, తన తపోశక్తితో వాళ్లకి దివ్యాస్త్రాలను అందజేస్తాడు. ఆ దివ్యాస్త్రాలు వాళ్లను తప్పకుండా రక్షిస్తాయని చెప్పేసి ఆశీర్వదిస్తాడు. ఆ అస్త్రాలను అందుకున్న రామలక్ష్మణులు ఆయనకి వినయంగా నమస్కరిస్తారు. ఆ తరువాత తమకి ఇక సెలవీయమని కోరతారు.

అందుకు విశ్వామిత్రుడు నవ్వుతూ, అప్పుడే వాళ్లు వచ్చినపని పూర్తికాలేదని అంటాడు. తాము ఆశ్రమం నుంచి మిథిలా దేశానికి వెళ్లవలసి ఉందని చెబుతాడు. మిథిలా దేశానికి ప్రయాణంలో కారణం తెలియక రామలక్ష్మణులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. వాళ్ల ఉద్దేశం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది. మరునాడు ఉదయమే తాము మిథిలా నగరానికి బయల్దేరవలసి ఉందనీ, అక్కడికి ఎందుకు వెళ్లాలనే విషయాన్ని మార్గమధ్యంలో తాను చెబుతానని ఆయన అంటాడు. అప్పటి వరకూ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోమని చెబుతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 5 : Maricha Subahu antics controlled

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: