Ramayanam – 6 : Sita introduction

మిథిలా నగరాన్ని జనక మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు. ప్రజారంజకంగా ఆయన పాలన సాగుతూ ఉంటుంది. మిథిలలో ఎలాంటి మోసాలకు, ద్వేషాలకు తావులేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. ఒకసారి జనక మహారాజు శాస్త్ర విధిని అనుసరించి నాగలి పట్టుకుని భూమిని దున్నుతూ ఉంటాడు. ఆ సమయంలో నేల లోపల ఏదో అడ్డు తగలడంతో ఎద్దులు ఆగిపోతాయి. దాంతో నాగలికి తట్టుకున్న ఆ వస్తువు ఏమిటనేది చూడమని తన సిబ్బందిని జనక మహారాజు ఆదేశిస్తాడు.

నాగలి తట్టుకున్న చోటున కొద్దిగా తవ్వి అక్కడ ఉన్న ఒక పెట్టెను వాళ్లు బయటికి తీస్తారు. ఆ పెట్టెను తెరిచి చూడగా లోపల నవ్వుతూ ఒక పసిపాప కనిపిస్తుంది. ఆ పసిపాపను చూడగానే జనక మహారాజు ఆనందాశ్చర్యాలకు లోనవుతాడు. భూదేవి తనకి ఆ బిడ్డను ఇచ్చిందని సంతోషంతో పొంగిపోతాడు. నాగేటిచాలులో దొరికిన ఆ బిడ్డకు “సీత” అని నామకరణం చేస్తారు. ఆ పసిబిడ్డను ఎత్తుకుని తన భవనానికి చేరుకుంటాడు. అయోనిజగా ఆవిర్భవించిన ఆ బిడ్డను ఆయన అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంటాడు.

సీత ఆటాపాటలతోనే జనక మహారాజుకు తెల్లారుతుంటుంది, పొద్దుపోతూ ఉంటుంది. ఎప్పుడూ తన స్నేహితులతో కలిసి సీత అంతఃపురంలో సరదాగా, సంతోషంగా గడుపుతూ ఉంటుంది. ఆమె ఎదుగుతున్నా కొద్దీ మహా సౌందర్యరాశిగా మారుతుంటుంది. సీత ఎలా ఉంటుందన్నది బయట ప్రపంచానికి తెలియదు. కానీ అంతఃపురంలో పనిచేసేవారి ద్వారా ఆ రాజ్యంలోని వారికి ఆమె ఎంతో అందగత్తె అని తెలుస్తుంది. అదే విషయం సరిహద్దులు దాటేసి వెళుతుంది. అలా సీత అందచందాలను గురించిన విషయం ఆయా రాజ్యాలకు చెందిన రాజుల చర్చల్లోను వస్తుంటుంది.

ఒకసారి సీత తన స్నేహితులతో కలిసి బంతి ఆటలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఒక పొడవైన బల్ల కిందికి ఆ బంతి వెళుతుంది. ఆ బంతి కోసం చాలా తేలికగా ఆమె ఆ బల్లను పక్కకు జరుపుతుంది. అది సామాన్యమైన బల్ల కాదు .. శివ ధనుస్సు ఉంచబడిన బల్ల. ఆ బల్లను పక్కకి జరపడానికి అరడజను మంది అవసరమవుతారు. అలాంటి బల్లను సీత చాలా తేలికగా జరపడం చూసిన జనక మహారాజు ఆశ్చర్యపోతాడు. ఆ శివ ధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడికి సీతను ఇచ్చి వివాహం చేస్తానని స్వయం వరాన్ని ప్రకటిస్తాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 6 : Sita introduction

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: