Ramayanam – 30 : Rama kills Vali

వాలిని వధించి సుగ్రీవుడికి రాజ్యాధికారాన్ని అప్పగించడానికి రామలక్ష్మణులు అంగీకరిస్తారు. వాలిని యుద్ధానికి పిలవమనీ, అతణ్ణి తాను చెట్టుచాటు నుంచి బాణంతో కొడతానని రాముడు చెబుతాడు. దాంతో సుగ్రీవుడు ఎంతో ఉత్సాహంతో వాలి నివాస మందిరానికి వెళతాడు. తొడగొడుతూ వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. సుగ్రీవుడే వెతుక్కుంటూ రావడంతో వాలి సంతోషపడిపోతాడు. తన గద అందుకుని ఒక్కసారిగా సుగ్రీవుడిపై విరుచుకుపడతాడు. ఇద్దరిమధ్య పోరు భీకరంగా జరుగతుంది. వాలి చేతిలో గాయాలపాలైన సుగ్రీవుడు తప్పించుకుని రాముడి దగ్గరికి వస్తాడు.

వాలితో తాను యుద్ధం చేస్తుండగా, చెట్టుచాటు నుంచి బాణం వదులుతానని చెప్పి ఎందుకు అలా చేయలేదని అసహనంతో అడుగుతాడు. ఆ ఇద్దరూ ఒకే పోలికతో ఉండటం వలన, ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అనేది తెలియక సందేహించానని రాముడు చెబుతాడు. ఈ సారి మెడలో ఒక పూల మాల వేసుకుని వెళ్లి వాలిని యుద్ధానికి పిలవమని అంటాడు. మెడలో పూలమాలలేని వాడు వాలి అని తనకి తెలుస్తుంది గనుక, అతణ్ణి తప్పక సంహరిస్తానని చెబుతాడు. దాంతో అలాగే మెడలో ఒక పూలమాల వేసుకుని వెళ్లి వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు.

సుగ్రీవుడు అంతకుముందే చావుదప్పి కన్నులొట్టబోయి పారిపోయాడు, అలాంటివాడు వెంటనే వచ్చి మళ్లీ కవ్విస్తున్నాడంటే ఏదో మర్మం ఉందని వాలి భార్య తార గ్రహిస్తుంది. అదే విషయాన్ని వాలితో చెప్పి యుద్ధానికి వెళ్లడం మంచిదికాదని వారిస్తుంది. సుగ్రీవుడు ఎవరి అండదండలు చూసుకుని తనపైకి వచ్చినా తనకి ఏమీ కాదనీ, తనని ఎవరూ ఏమీ చేయలేరని వాలి అంటాడు. సుగ్రీవుడిని పైలోకానికి పంపించే తిరిగివస్తానని చెప్పి వెళతాడు. కానీ తారకి మాత్రం మనసంతా ఆందోళనగానే ఉంటుంది.

వాలి, సుగ్రీవుల మధ్య మళ్లీ పోరు మొదలవుతుంది. సుగ్రీవుడిని అంతమొందించే క్షణాల కోసం ఎదురుచూస్తూ వాలి దాడి చేస్తుంటాడు. అదే సమయంలో వాలికి గురిపెట్టి రాముడు బాణం వదులుతాడు. ఆ దెబ్బకు బాధతో అరుస్తూ వాలి ఒక్కసారిగా నేలకూలుతాడు. అధర్మంగా తనపై బాణ ప్రయోగం చేసిన రాముడి తీరుపట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. ఎదుటివారి శక్తిని హరించే వరం అతనికి ఉండటం వలన అలా చేశాననీ, అయినా అతను అధర్మ మార్గంలో నడుస్తుండటం వలన అలా చేయక తప్పలేదని రాముడు చెబుతాడు. తన అజ్ఞానాన్ని పటాపంచలు చేసిన రాముడికి నమస్కరిస్తూ వాలి ప్రాణాలు వదులుతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 30 : Rama kills Vali

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: