Ramayanam – 31 : Sugriva coronation and search for Sita

వాలి సంహారం జరిగిన తరువాత సుగ్రీవుడు కిష్కింధకు రాజు అవుతాడు. అప్పటికే వర్షాకాలం మొదలు కావడంతో, వర్షాకాలం పూర్తయిన తరువాత సీతాదేవి అన్వేషణ మొదలుపెట్టడం మంచిదని రాముడు చెబుతాడు. అందుకు సుగ్రీవుడు అంగీకరిస్తాడు. సుగ్రీవుడు చూపిన గుహలోనే రామలక్ష్మణులు ఉండిపోతారు. కాలం గడిచిపోతూ ఉంటుంది, సుగ్రీవుడు సుఖసంతోషాలతో కాలం గడుపుతూ ఉంటాడు. వర్షాకాలం పూర్తికావడంతో, ఆ విషయాన్ని సుగ్రీవుడికి హనుమంతుడు గుర్తుచేస్తాడు. అయినా సుగ్రీవుడు పెద్దగా పట్టించుకోడు.

సుగ్రీవుడి నుంచి ఎలాంటి కబురు రాకపోవడంతో రాముడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. వాలిని సంహరించిన అస్త్రం ఇంకా తన అమ్ములపొదిలోనే ఉందనే విషయాన్ని సుగ్రీవుడికి గుర్తుచేసి రమ్మని చెప్పి లక్ష్మణుడిని పంపిస్తాడు. లక్ష్మణుడి రాకను గురించి తెలుసుకున్న సుగ్రీవుడు ఉలిక్కిపడతాడు. తనని మన్నించమని లక్ష్మణుడిని కోరతాడు. లక్ష్మణుడితో కలిసి రాముడు ఉన్న గుహకు చేరుకుంటాడు. రాముడిని చూడగానే వెంటనే వెళ్లి ఆయన పాదాలపై పడతాడు. తనని క్షమించమని వేడుకుంటాడు.

సీతాదేవి జాడ తెలిసే వరకూ విశ్రమించనని చెప్పి, వానరవీరులను గుంపులుగా నలు దిక్కులకు పంపిస్తాడు. దక్షిణ దిక్కుగా వెళ్లి వెదకమని హనుమంతుడిని సుగ్రీవుడు ఆజ్ఞాపిస్తాడు. హనుమంతుడు బయల్దేరుతూ రాముడి దగ్గరికి వస్తాడు. ఒకవేళ సీతాదేవి కనిపించినా ఆమె తనని నమ్మకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటాడు. అందువలన రాముడి గుర్తుగా ఏదైనా ఇవ్వమని అడుగుతాడు. దాంతో రాముడు తన చేతికి గల ఉంగరం తీసి హనుమంతుడికి ఇస్తాడు.

దక్షిణ దిక్కుగా బయల్దేరిన వానర సైన్యం సముద్రం దగ్గర ఆగిపోతుంది. అయితే సముద్రం దాటడం ఎవరి వలనా కాదు, అందువలన ఏం చేయాలనే ఆలోచనలో పడతారు. అందుకు జాంబవంతుడు సరైనవాడని అనుకుంటారు. తాను వెళ్లగలనుగానీ వయసు పైబడిన కారణంగా తిరిగి రాలేనని జాంబవంతుడు అంటాడు. దాంతో అంతా హనుమంతుడివల్లనే అవుతుందనే అభిప్రాయానికి వస్తారు. ఆయన శక్తి ఆయనకి తెలియదని చెప్పేసి, ప్రోత్సహిస్తారు. దాంతో ఒక ఎత్తైన పర్వతం పై నుంచి ఎగిరిన హనుమంతుడు, ఆకాశమార్గాన దూసుకుపోతుంటాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 31 : Sugriva coronation and search for Sita

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: