Ramayanam – 28 : Shabari hospitality to Rama Lakshmana

జటాయువు పక్షికి అంత్యక్రియలు నిర్వహించిన రామలక్ష్మణులు, ఆ పక్షిరాజుకు ఉన్నత లోకాలు కలగాలని కోరుకుని అక్కడి నుంచి ముందుకు సాగుతారు. అలా వాళ్లు “శబరి” ఆశ్రమానికి చేరుకుంటారు. గతంలో “మతంగ మహర్షి” ఆశ్రమంలో తలదాచుకున్న శబరి, ఆయనను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తూ వస్తుంది. శ్రీరామచంద్రుడు తమ ఆశ్రమానికి వస్తాడనీ, ఆయన దర్శన భాగ్యం తరువాత ఆమెకి ముక్తి లభిస్తుందని మతంగ మహర్షి చెబుతాడు. అప్పటి నుంచి ఆమె రామచంద్రుడి రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటుంది.

రాముడు వస్తే ఆయనకి తినిపించడం కోసం అనేక పండ్ల మొక్కలను ఆమె పెంచుతూ ఉంటుంది. అలాగే ఆయన పాదాల చెంత సమర్పించడం కోసం ఎన్నో రకాల పూల మొక్కలను పెంచుతూ ఉంటుంది. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ రాముడి కోసం ఎంతో ఆనందంగా ఎదురుచూడటం, ఆయన రాకపోయేసరికి నిరాశ చెందడం మరుసటి రోజు తప్పకుండా వస్తాడని మళ్లీ ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. అలా ఎన్నో ఏళ్లు గడిచిపోతాయి. రాముడి కోసం ఎదురుచూసి చూసి ఆమె కళ్లు కాయలు కాచిపోతాయి.

ఆ రోజున పూసిన పూలలో ఆమెకి కొత్తదనం కనిపిస్తుంది, అవి రోజూ కంటే మరింతగా పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. ఇక ఫలాలు మరింత పక్వానికి వచ్చినట్టుగా అనిపిస్తాయి. ఆశ్రమ పరిసరాల్లో తిరుగాడే పశువుల్లోను, పక్షుల్లోను ఏదో తెలియని ఉత్సాహం కనిపిస్తుంది. దాంతో ఆ రోజున రాముడు రావడం ఖాయమని ఆమె భావిస్తుంది. అలా అనుకుంటూ ఉండగానే రామలక్ష్మణులు ఆమె ఆశ్రమంలో అడుగుపెడతారు. అంతే ఆమె సంతోషానికి అవధులు లేకుండాపోతాయి. ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉండగా, ఆమె కళ్లు మసకబారతాయి.

రామలక్ష్మణులను ఆత్మీయంగా ఆహ్వానిస్తుంది. తన తోటలోని వివిధ రకాల పూలను తెచ్చి ఆయన పాదాలను పూజిస్తుంది. తను పెంచిన చెట్ల నుంచి ఫలాలు కోసుకొచ్చి, ముందుగా తాను రుచి చూసి మరీ అతనికి తినిపిస్తుంది. శబరి భక్తికి మెచ్చిన రాముడు ఆమె ఎంగిలి చేసిన పండ్లను ఎంతో ప్రేమతో తింటాడు. సీతమ్మ అపహరణ పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అక్కడికి దగ్గరలోగల “ఋష్యమూక” పర్వతంపై సుగ్రీవుడు నివసిస్తున్నాడనీ, అతని సహాయ సహకారాలను తీసుకోమని సూచిస్తుంది. రాముడి అనుగ్రహంతో శబరి నదిగా మారిపోయి తన జన్మను సార్థకం చేసుకుంటుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 28 : Shabari hospitality to Rama Lakshmana

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: