Ramayanam – 91 : Sita agony

రాముడిని చూసిన తరువాత సీతాదేవి మనసు కుదుటపడుతుంది. సీతాదేవి కనిపించిన తరువాతనే ఎంతోకాలంగా రాముడు అనుభవిస్తూ వస్తున్న ఆవేదన నుంచి ఉపశమనం కలుగుతుంది. వాళ్లిద్దరినీ అలా చూసిన వాల్మీకి మహర్షి ఆనందంతో పొంగిపోతాడు. లక్ష్మణుడు – శత్రుఘ్నుడు ఇద్దరూ కూడా సీతాదేవిని అయోధ్యకు రావలసిందిగా కోరతారు. ఆమె అడుగుపెడితే అయోధ్య పూర్వ వైభవాన్ని పొందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. తమతో బయలుదేరమని కోరతారు. రాముడు కూడా ఆమె వస్తుందనే అనుకుంటాడు.

కానీ సీతాదేవి రాముడికి నమస్కరిస్తుంది, తనని తల్లికంటే ఎక్కువగా ఆదరించిన కౌసల్యాదేవికి తన నమస్కారాలు తెలియజేయమని కోరుతుంది. అలాగే మిగతా అత్తగార్లైన కైకేయి – సుమిత్రలను కూడా వందనాలు తెలియజేయమని అంటుంది. అయోధ్య ప్రజలందరికీ తన కృతజ్ఞతలు తెలుపమని చెబుతుంది. తన మాట వలన, ప్రవర్తన వలన తెలిసి తెలియక ఎవరి మనసులను కష్టపెట్టినా, పెద్ద మనసు చేసుకోమని చెప్పమని అంటుంది.

సీతాదేవి ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థంకాక రాముడు అయోమయానికి లోనవుతాడు. అయోధ్యావాసులందరినీ అడిగినట్టు చెప్పమని అంటుందంటే ఆమె తమతో రాకూడదని నిర్ణయించుకుందా? అనే సందేహానికి లోనవుతాడు. తన వైపు నుంచి చెప్పవలసిందంతా చెప్పాడు, వాల్మీకి మహర్షి కూడా విధి బలీయమైనదనే అన్నాడు. లవకుశులను తాను దగ్గరికి తీసుకుంటే సీత ఎంతగానో సంతోషించింది. అలాంటి సీత తనతో రాకూడదని ఎందుకు అనుకుంటోంది? అనే ఆశ్చర్యానికి లోనవుతాడు.

లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కూడా సీతాదేవి మాటలకు ఆలోచనలో పడతారు. సీతాదేవి అడవులలో ఎన్నో కష్టాలను తట్టుకుంది. మహారాణివాసం దూరమై ఆశ్రమ జీవితాన్ని అనుభవించింది. లవకుశులను పెంచి పెద్ద చేసింది. ఆ ఇద్దరినీ వీరులుగా తీర్చిదిద్దింది. అలాంటి సీతాదేవి కష్టాలు తీరినందుకు సంతోషపడుతూ, రాముడి వెంట అయోధ్యకు వస్తుందని అనుకుంటే, అందుకు భిన్నంగా ఆమె ఎందుకు మాట్లాడుతోందనే ఆలోచనలో పడతారు. తమ తల్లి మనసులోని ఆలోచన ఏమిటో అర్థంకాక లవకుశులు కూడా అయోమయానికి లోనవుతారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 91 : Sita agony

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: