Ramayanam – 92 : Sita goes to mother Earth

రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, లవకుశులు అంతా చూస్తుండగానే సీతాదేవి భూదేవికి నమస్కరిస్తుంది. తన మనసు రాముడి పాదాలను ఆశ్రయించి ఉంటే, అనుక్షణం తను రాముడి ధ్యానంలో ఉన్నట్లయితే, తన మనోఫలకంపై రాముడి దివ్యమంగళ విగ్రహమే ఎప్పటికీ నిలిచి ఉన్నట్లయితే, ఇతర ఆలోచనలు లీలామాత్రంగానైనా అంటని పవిత్రతను తాను కలిగి ఉంటే ఓ తల్లి నన్ను నీలో కలిపేసుకో .. అంటూ సీతాదేవి తన తల్లి అయిన భూదేవిని కోరుతుంది. ఆమె ఆ మాట అనగానే అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు.

సీతాదేవి ఎప్పుడైతే అలా కోరిందో ఆ మరుక్షణమే వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. ఆకాశం ఎప్పుడూ చూడని వర్ణంలోకి మారిపోతుంది. ఒక్కసారిగా పెనుగాలులు వీయడం మొదలుపెడతాయి. సముద్రాలు అల్లకల్లోలం అవుతూ ఉంటాయి. వాతావరణంలో వచ్చిన విపరీతమైన మార్పులకు కారణమేమిటో తెలియక పక్షులు, పశువులు అన్నీ కూడా తమ సహజ ప్రవర్తనకి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అడవిలోని మృగాలన్నీ చెల్లాచెదురైపోతుంటాయి.

ఒక ప్రళయం ముంచుకురానున్నట్టుగా పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తుందో తెలియని ఒక శబ్దం అంతా ఆవరిస్తూ ఉంటుంది. ఈ ప్రళయానికి కారణం సీతమ్మతల్లి పాతివ్రత్య మహిమనే విషయం వాల్మీకి మహర్షికి అర్థమైపోతుంది. రామలక్ష్మణులు, శత్రుఘ్నుడు, లవకుశులు అంతా కూడా ఏం జరుగుతుందో తెలియని అయోమయానికి లోనవుతారు. లవకుశులు తమ తల్లిని ఆలింగనం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

అదే సమయంలో వాళ్ల కాళ్ల క్రింద భూమి కదులుతున్నట్టుగా అవుతుంది. దాంతో అందరికీ అడుగులు తడబడతాయి. చూస్తుండగానే ఆ ప్రదేశంలోని నేల ఒక్కసారిగా పగుళ్లు చూపుతూ విచ్చుకుంటుంది. ఆ పగుళ్లలో నుంచి భూదేవి పైకి రావడంతో, పరుగున వెళ్లి సీతాదేవి ఆమె చేయి అందుకుంటుంది. ఏం జరుగుతుందనేది రాముడికి అర్థమయ్యేలోగా, సీతాదేవితో సహా భూదేవి తిరిగి లోపలికి వెళ్లిపోవడం .. తిరిగి నేల యధావిధిగా కావడం జరిగిపోతుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 92 : Sita goes to mother Earth

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: