Ramayanam – 23 : Sita asks Rama to bring golden Deer

రావణుడు చెప్పిన ప్రకారం మారీచుడు బంగారు వన్నె కలిగిన లేడి రూపంలో రాముడి ఆశ్రమం దగ్గరికి వెళతాడు. పూలమాల కడుతున్న సీత ఆ లేడిని చూస్తుంది. ఆ లేడీ వర్ణం, తళుక్కున మెరిసే దాని కళ్లు చూసి ముచ్చటపడుతుంది. ఆశ్రమ సమీపంలో అది చెంగు చెంగున దూకుతూ ఉండటం చూసి మురిసిపోతుంది. సూర్యకిరణాలు పడగానే బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఆ లేడి ఒక అద్భుతమని అనుకుంటుంది. ఆ లేడిని తమ ఆశ్రమంలో పెంచుకోవాలని అనుకుంటుంది. వెంటనే రాముడిని పిలిచి ఆ లేడిని చూపుతుంది. ఆ లేడి తనకి కావాలని అడుగుతుంది.

బంగారులేడిని తెచ్చి ఇవ్వడానికి రాముడు సిద్ధమవుతాడు. ఆయనను లక్ష్మణుడు వారిస్తాడు. తాము ఎన్నో అడవులను దాటుకుంటూ వచ్చామనీ, ఎక్కడా కూడా ఇలాంటి లేడిని చూసింది లేదని అంటాడు. ఇది రాక్షస మాయ కావొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. తనని సీత ఎప్పుడూ ఏమీ అడగలేదనీ, అలాంటిది ఆమె ముచ్చట తీర్చడం కోసం ఆ లేడిని తీసుకొచ్చి ఇవ్వడం తనకి ధర్మంగా అనిపిస్తుందని రాముడు అంటాడు. అయితే తాను వెళ్లి ఆ లేడిని తీసుకొచ్చి ఇస్తానని లక్ష్మణుడు చెబుతాడు.

భర్తగా భార్య ముచ్చట తీర్చవలసిన బాధ్యత తనపై ఉందనీ, తాను తిరిగి వచ్చేవరకూ సీతను కనిపెట్టుకుని ఉండమని చెప్పి రాముడు వెళతాడు. బంగారులేడి వాయువేగంతో పరిగెడుతూ ఉంటుంది. రాముడు దాని వెంట పరుగుపెడుతూ ఉంటాడు. రాముడి బాణాలకు ఆ లేడి దొరక్కుండా అదృశ్యమవుతూ, అంతలోనే ప్రత్యక్షమవుతూ దూసుకుపోతూ ఉంటుంది. చిన్నపాటి గాయంతో ఆ లేడి వేగాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో రాముడు బాణం వదులుతాడు. తమ పథకంలోని భాగంగానే, “సీతా .. లక్ష్మణా” అని పెద్దగా రాముడి గొంతును అనుసరిస్తూ అరుస్తూ నిజరూపాన్ని ధరించిన మారీచుడు ప్రాణాలు విడుస్తాడు.

బంగారులేడి మారీచుడిగా మారడం, సీత లక్ష్మణులను తన గొంతుకతో పిలుస్తూ ప్రాణాలు వదలడంతో, అదంతా రాక్షస మాయ అనే విషయం రాముడికి అర్థమవుతుంది. అంతే క్షణమైనా ఆలస్యం చేయకుండా ఆయన వెనుదిరుగుతాడు. ఆశ్రమం దిశగా పరుగులాంటి నడకతో వస్తూనే ఉంటాడు. అయితే అప్పటికే ఆ అరుపులు సీత లక్ష్మణుల చెవిన పడతాయి. దాంతో సీతాదేవి తీవ్రమైన ఆందోళన చెందుతుంది. రాముడికి ఏదో ఆపద వాటిల్లినట్టుగా అనిపిస్తోందనీ, వెంటనే వెళ్లమని లక్ష్మణుడిని తొందర చేస్తుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 23 : Sita asks Rama to bring golden Deer

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: