Ramayanam – 22 : Ravana asks Maricha to disguise as golden deer for kidnapping Sita

లంకానగరం వైపు, తన సంబంధీకుల వైపు ఎవరైనా చూడాలన్నా మాట్లాడాలన్నా భయపడాలనే నిర్ణయానికి రావణుడు వస్తాడు. అందువలన సీతను అపహరించి, తన చెల్లెలిని అవమానించిన వారికి తగిన గుణపాఠం చెప్పాలని భావిస్తాడు. అనుకున్నదే తడవుగా మారీచుడిని పిలిపిస్తాడు. రావణుడి దగ్గరికి వచ్చిన మారీచుడు తనని పిలిపించిన కారణం ఏమిటని అడుగుతాడు. జరిగిన సంఘటనను గురించి అతనికి వివరించిన రావణుడు, తాను సీతను అపహరించాలనుకుంటున్నట్టు చెబుతాడు.

తన చెల్లెలి ముక్కు కోసి అవమానించిన రామలక్ష్మణులకు తగిన బుద్ధి చెప్పాలనే తాను నిర్ణయించుకున్నానని రావణుడు అంటాడు. రామలక్ష్మణులను తాను చాలా ఇబ్బందులకు గురిచేయాలనుకుంటున్నాననీ, అందువలన తాను వాళ్లతో యుద్ధానికి దిగడం లేదని చెబుతాడు. బంగారు వన్నె కలిగిన లేడిలా మారిపోయి సీతకు కనిపించమనీ, ఆమెను ఆకర్షించమని అంటాడు. అప్పుడు సీత ఆ లేడిని తెచ్చివ్వమని రామలక్ష్మణులను కోరుతుందనీ, వాళ్లు తరుముతుండగా తప్పించుకుంటూ ఆశ్రమానికి దూరంగా తీసుకెళ్లమని అంటాడు.

రావణుడి మాటలను వినగానే మారీచుడు ఉలిక్కిపడతాడు. రామలక్ష్మణుల శక్తి సామర్ధ్యాలు తెలియక అతను అలా మాట్లాడుతున్నాడని అంటాడు. విశ్వామిత్రుడి యాగానికి భంగం కలిగిస్తున్న తన తల్లి తాటాకిని, తన సోదరుడైన సుబాహుడిని రామలక్ష్మణులు సంహరించారని చెబుతాడు. తాను చావుదప్పి కన్నులొట్టబోయి తప్పించుకుని పారి పోయానని అంటాడు. అలాంటి రాముడి జోలికి జీవితంలో వెళ్లకూడదని తాను ఆ రోజునే అనుకున్నానని చెబుతాడు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను ఎన్నడూ ఊహించలేదని అంటాడు.

రామలక్ష్మణులతో పెట్టుకోవాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచే పతనం మొదలైనట్టుగా అనుకోవాలనీ, రాజ్యాలు సుఖభోగాలు కోరుకునేవారు వాళ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిదని హితవు చెబుతాడు. అతను రామలక్ష్మణుల శౌర్యపరాక్రమాలను గురించి మాట్లాడగానే రావణుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. అతనితో చెప్పించుకోవడానికి తాను సిద్ధంగా లేననీ, తాను చెప్పినట్టుగా చేయమని ఆదేశిస్తున్నానని అంటాడు. తన మాట వినకపోతే తన చేతిలో చావు తప్పదని హెచ్చరిస్తాడు. దాంతో రావణుడి చేతిలో చావడం కంటే, ధర్మపరుడైన రాముడి చేతిలో మరణించడమే మంచిదని భావించిన మారీచుడు అందుకు అంగీకరిస్తాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 22 : Ravana asks Maricha to disguise as golden deer for kidnapping Sita

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: