Ramayanam – 70 : Sita enters Valmiki ashram
అడవిలోని ఓ ప్రదేశంలో వాల్మీకి మహర్షి తన శిష్య బృందంతో కలిసి నివసిస్తూ ఉంటాడు. నారద మహర్షి సూచన మేరకు ఆయన రామాయణ రచనను పూర్తి చేస్తాడు. అడవిలో ఎటువైపు వెళ్లాలో తెలియక సీతాదేవి నానా కష్టాలు పడుతూ, వాల్మీకీ ఆశ్రమం దిశగా వెళుతుంది. తన ఆశ్రమం సమీపంలోకి వచ్చిన సీతాదేవిని వాల్మీకి మహర్షి చూస్తాడు. ఆమె సీతాదేవి అనే విషయం ఆయనకి అర్థమైపోతుంది. ఆమె ఏ కారణంగా అడవిలో ఒంటరిగా ఉందనే విషయం ఆయనకి తెలిసిపోతుంది.
తాను వాల్మీకి మహర్షిననే విషయాన్ని సీతాదేవికి చెబుతాడు. గర్భవతి అయిన ఆమెను తన ఆశ్రమానికి రమ్మని కోరతాడు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నది సీతాదేవి ఆయనకి వివరిస్తుంది. తనని చేరదీయడం వలన ఆయనకి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని అంటుంది. ఆమె అడుగుపెట్టడంతో తన ఆశ్రమ ప్రాంతం పరమ పవిత్రం అవుతుందని వాల్మీకి మహర్షి అంటాడు. ఆమె రాక వలన తన జన్మ ధన్యమవుతుందని చెబుతాడు. ఆమె పేరు అందరికీ తెలుస్తుందనే బెంగ అవసరం లేదనీ, లోకపావని పేరుతోనే అందరికీ పరిచయం చేస్తానని అంటాడు.
వాల్మీకి మహర్షి పదే పదే కోరడంతో ఆయన ఆశ్రమంలో తలదాచుకోవడానికి సీతాదేవి అంగీకరిస్తుంది. ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుని మౌనంగా అనుసరిస్తుంది. సీతాదేవిని వెంటబెట్టుకుని ఆయన తన ఆశ్రమానికి తీసుకొస్తాడు. అక్కడి తపస్వినులకు లోకపావనిగానే సీతాదేవిని పరిచయం చేస్తాడు. గర్భవతి అయిన ఆమెను భక్తి శ్రద్ధలతో సేవించమని వాళ్లకు చెబుతాడు. సీతాదేవి కోసమే ప్రత్యేకంగా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయించి అందులో ఆమెను ఉంచుతాడు.
వాల్మీకి మహర్షి ఆశ్రమంలో నిరంతరం రామనామ సంకీర్తనం జరుగుతూ ఉంటుంది. దాంతో సీతాదేవి తన కష్టాలను, బాధలను త్వరగా మరిచిపోగలుగుతుంది. ఆశ్రమ వాతావరణం .. అక్కడి తాపసుల ఆత్మీయత .. వాళ్లు చూపుతున్న ఆదరణ .. సీతాదేవికి మానసికపరమైన ప్రశాంతతను అందిస్తాయి. దాంతో ఆమె కూడా ఆ నామ సంకీర్తనంలో పాలుపంచుకుంటూ, వన్యప్రాణులకు ఆహారాన్ని అందిస్తూ రాముడినే మనసులో నిలుపుకుని ఆయన రూపాన్ని ధ్యానిస్తూ కాలం గడుపుతూ ఉంటుంది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 70 : Sita enters Valmiki ashram
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.