Ramayanam – 8 : Sita swayamvar

మిథిలా నగరంలో సీత స్వయంవరానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఇతర రాజ్యాలకి చెందిన రాజులతో పాటు గంధర్వులు, యక్షులు, కిన్నెరులు కూడా ఆ స్వయంవరానికి హాజరవుతారు. రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు అక్కడికి చేరుకుంటారు. వీరాధివీరులైన రాజులు శివధనుస్సును పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తుంటారు. మహాబలపరాక్రమవంతులైన వారు కూడా ఆ శివ ధనుస్సును ఒక్క అంగుళం కూడా కదపలేకపోతారు. వచ్చినవారు వచ్చినట్టుగా అవమాన భారంతో తిరిగి వెళ్లిపోతుంటారు. అలా తిరిగి వెళ్లిన వారిలో రావణాసురుడు కూడా ఒకరు.

ఒకసారి ప్రయత్నించి చూడమన్నట్టుగా రాముడివైపు విశ్వామిత్రుడు చూస్తాడు. దాంతో రాముడు వెళ్లి శివధనుస్సును అవలీలగా పైకి ఎత్తుతాడు. అంతేకాదు ఆ విల్లుకు వింటినారి ఎక్కించుతాడు, ఆత్రాడును ఒకసారి వెనక్కిలాగుతాడు. వెనక్కి వంగిన విల్లు ఒక్కసారిగా ఫెళ్లు మంటూ విరిగిపోతుంది. ఎవరూ కూడా కనీసం కదిలించలేకపోయిన ఆ విల్లును, రాముడు విరగొట్టడంతో, అతని పరాక్రమం ఎలాంటిదో వాళ్లకు అర్థమవుతుంది. సౌందర్యమూర్తి అయిన రాముడి రూపం చూసిన సీత, ఆనందంతో మురిసిపోతూ ఆయన మెడలో మూలమాలను వేస్తుంది.

జనకమహారాజు ద్వారా కబురు అందుకున్న దశరథ మహారాజు తన పరివారంతో మిథిలా నగరానికి చేరుకుంటాడు. సీత తన కోడలు అయినందుకు దశరథుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. సీతారాములకు పెద్దల సమక్షంలో వివాహ మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతాయి. అదే సమయంలో తన మరో కూతురైన ఊర్మిళను లక్ష్మణుడికి ఇవ్వాలనుకుంటున్నట్టు జనక మహారాజు చెబుతాడు. తన సోదరుడైన కుశధ్వజుడికి మాండవి, శ్రుతకీర్తి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారనీ, భరత, శత్రుఘ్నులతో వారి వివాహానికి అంగీకరించమని దశరథ మహారాజును కోరతాడు. అందుకు ఆయన అంగీకరించడంతో ఒకే ముహూర్తంలో అందరి వివాహాలు జరుగుతాయి.

జనక మహారాజు తన ఇద్దరి కుమార్తెలు, తన సోదరుడి కుమార్తెలు దశరథుడి కోడళ్లు అయినందుకు ఎంతగానో పొంగిపోతాడు. దశరథ మహారాజుతో సంబంధం అందుకున్నందుకు తన వంశం తరించిందని చెబుతాడు. తన కుమార్తెలందరికీ మహావీరులు భర్తలుగా లభించడం వాళ్లు చేసుకున్న అదృష్టం అని అంటాడు. దశరథుడి వంశానికి పేరు ప్రతిష్ఠలు తెచ్చేలా మసలుకోమని తన కుమార్తెలకు చెబుతాడు. తన కూతుళ్లతో అత్తవారింటికి పంపించడానికి సమస్త లాంఛనాలను సిద్ధం చేయిస్తాడు.

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

Ramayanam – 8 : Sita swayamvar

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: