Introduction to Ramayanam in Telugu

“రామాయణం” అంటే రాముడు చూపిన మార్గం అని అర్థం. రాముడు నడిచిన మార్గమని అర్థం. శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని పురాణాలు చెబుతున్నాయి. రావణ సంహారం కోసమే ఆయన రాముడిగా జన్మించాడని స్పష్టం చేస్తున్నాయి. రాముడిగా మానవరూపంలో జన్మించిన నారాయణుడు, ఒక మానవుడిగానే అనేక కష్టనష్టాలను అనుభవించాడు. మానవుడిగానే తన శక్తిసామర్థ్యాలతో కావలసినవాటిని సాధించుకున్నాడు. మానవుడిగా నడచుకుంటూనే ఈ లోకానికి ఆదర్శ పురుషుడుగా నిలిచాడు.  

శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు. ధర్మం ఎలా ఉంటుంది అంటే మూర్తీభవించిన రాముడిలా ఉంటుంది అని మహర్షులు సెలవిచ్చారు. ఒక తనయుడిగా, భర్తగా, తండ్రిగా, ప్రభువుగా, శిష్యుడిగా, సోదరుడిగా, స్నేహితుడిగా మానవుడు ఎలా నడచుకోవాలో ఎలా మసలుకోవాలో రాముడు అనుసరించి చూపించాడు. ఒక మనిషి మాటపై ఎలా నిలబడాలో అందుకోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎలా ఎదుర్కొని నిలబడాలో ఈ లోకానికి చాటిచెప్పాడు. 

రాముడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి శాంతమూర్తి. క్షమించడం ఆయనకి తెలిసిన మొదటి విద్య. తాను అడవులపాలు కావడానికి కారకురాలైన కైకేయిని రాముడు పల్లెత్తుమాట కూడా అనలేదు. సీతాదేవిని అపహరించి తనని అనేక ఇబ్బందులకు గురిచేసిన రావణుడికి మరోసారి ఆలోచించుకుని రమ్మని చెప్పి గడువు ఇచ్చిన సహనశీలి. రావణుడి సంహారం విభీషణుడి పట్టాభిషేకం రాముడి ధర్మనిరతికి అద్దం పడతాయి. 

రాముడు హనుమంతుడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. గుహుడును గుండెలకు హత్తుకున్నాడు. శబరిని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాడు. తనని ప్రేమించేవారి పట్ల రాముడు ఎంతటి కరుణతో కరిగిపోతాడనడానికి ఇలా ఎన్నో నిదర్శనాలు కనిపిస్తాయి. వనవాసం పూర్తయి తిరిగివచ్చిన తరువాత అతని తల్లి, పినతల్లులు రకరకాల పదార్థాలను విందులో వడ్డిస్తారు. శబరీ తనకి తినిపించిన ఎంగిలి పండ్లలోని రుచి ఎందులోనూ లేదని రాముడు అనడం, భక్తుల పట్ల ఆయనకి గల అనురాగానికి ఒక ఉదాహరణ. రాముడు ధర్మస్వరూపుడు అయితే, సీతమ్మతల్లి ఆదర్శమూర్తి. ఆమె మసలుకున్న తీరు మహిళాలోకానికే ఆదర్శం. అందువల్లనే రామాలయం లేని ఊరు, రామనామం జపించని నోరు కనిపించవు. ధర్మం ఎలా ఉంటుందో, ధర్మాచరణ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుకోసమే రామాయణం చదవాలి, వినాలి, అనుసరించాలి.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక : ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Introduction to Ramayanam in Telugu

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2024 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2024 – Panchangam – App on Apple App Store

Categorized in: