Introduction to Mahabharatham in Telugu

మహాభారతం .. ధర్మానికి .. అధర్మానికి మధ్య జరిగిన కథ. న్యాయానికి .. అన్యాయానికి మధ్య జరిగిన పోరాటం. మంచితనానికీ .. వంచనకు మధ్య సాగిన సంగ్రామం. మహాభారతాన్ని ఆస్తికోసం జరిగిన దాయాదుల గొడవగా మాత్రమే చూస్తే అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఆస్తిపాస్తుల కోసం ధర్మరాజు ఆరాటపడిన సందర్భాలు మహాభారతం మొత్తంలో ఎక్కడా కనిపించవు .. ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడిన మాటలు కూడా ఎక్కడా వినిపించవు. అందువలన ఇది దాయాదుల పోరుగా మాత్రమే చూడలేము. దుర్యోధనుడి అహంభావం .. ధర్మరాజు సహనం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

మహాభారతంలో ప్రతి పాత్ర ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ధర్మరాజు .. భీష్ముడు .. కర్ణుడు .. ద్రౌపది .. గాంధారి వ్యక్తిత్వాలు మహోన్నతమైన శిఖరాలుగా అనిపిస్తాయి. దృతరాష్ట్రుడి పుత్రవ్యామోహమే కౌరవులను కదన రంగానికి పంపించిందనే విషయాన్ని స్పష్టం చేస్తాయి. చిన్నతనం నుంచి పిల్లల్లో విషబీజాలు నాటితే వాటి పర్యవసానం ఎలా ఉంటుందనడానికి కౌరవులు ఒక ఉదాహరణగా నిలుస్తారు. మంచి మార్గంలో వెళ్లాలనుకునే వారికి తాత్కాలికంగా కష్టాలు ఎదురైనా విజయం వారినే వరిస్తుందనడానికి నిదర్శనంగా పాండవులు కనిపిస్తారు.

కౌరవుల ఒక్కగానొక్క సోదరి అయిన దుశ్శలను .. పాండవులు కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. దుశ్శల భర్త అయిన సైన్ధవుడు .. ద్రౌపదిపట్ల అసభ్యంగా ప్రవర్తించినా, దుశ్శలను దృష్టిలో పెట్టుకుని పాండవులు అతణ్ణి క్షమించి వదిలేస్తారు. కానీ అదే సైన్ధవుడు .. అభిమన్యుడి మరణానికి కారకుడయ్యాడు. ఆ వ్యూహంలో కౌరవులు ప్రధానమైన పాత్రను పోషించారు. తమ బంధువులు అనే ఒక ఆత్మీయ కోణం పాండవులలో కనిపిస్తుందే తప్ప, కౌరవుల్లో ఆ సానుభూతి కోణం కాగడా పట్టుకుని వెతికినా కనిపించదు.

కౌరవుల వెంటే ఉంటూ .. వాళ్ల పతనాన్ని కోరుకునే శకుని పాత్ర .. తన ఆత్మాభిమానం కాపాడిన కారణంగా కౌరవుల కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడని కర్ణుడి పాత్రలు మహాభారతంలో బలమైనవిగా కనిపిస్తాయి. కౌరవుల విషయంలో తల్లడిల్లే తల్లిగా గాంధారి .. ఎన్ని కష్టాలు ఎదురైనా ఓర్పును వహించే మహా పతివ్రతగా ద్రౌపది .. కర్ణుడు తన కుమారుడనే నిజాన్ని బయటికి చెప్పలేక బాధపడే “కుంతి” పాత్రలు .. జీవితం ఎన్నివైపుల నుంచి ఎలా అలుముకుంటుందో .. అల్లుకుంటుందో అనే విషయానికి అద్దం పడతాయి.

శ్రీకృష్ణుడు .. పాండవుల పక్షపాతి .. అందువల్లనే వాళ్లు విజయాన్ని సాధించారు అని అనుకోవడం అక్కడక్కడా వింటుంటాం. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదు. శ్రీకృష్ణుడు ధర్మ పక్షపాతి .. ధర్మం ఎటువైపు ఉంటే శ్రీకృష్ణుడు అటువైపు ఉంటాడు. ఆ విషయాన్ని ఆయన ధర్మరాజుకి స్పష్టంగా చెప్పాడు కూడా. మహా పరాక్రమవంతులైన అర్జునుడు .. భీముడు .. నకుల సహదేవులు ఆవేశంతో ధర్మం తప్పకుండా చూసుకో .. ధర్మం తప్పకుండా ఉన్నంతవరకూ నా సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి అని ఆయన స్పష్టం చేశాడు. అందుకే జీవితంలో ఎలా నడుచుకోవాలో .. ఎలా నడచుకోకూడదో అనే విషయాలను సమగ్రంగా చెప్పే ఇతిహాసంగా “మహాభారతం” కనిపిస్తుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక : పంచమవేదమైన “మహాభారతం”ను తర్వాతి కాలంలో ఎంతోమంది రచయితలు,కవులు తమదైన శైలిలో ఆవిష్కరించి మరింత సారవంతం చేశారు. వాటిల్లో మేము విన్నవి .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Introduction to Mahabharatham in Telugu

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2024 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2024 – Panchangam – App on Apple App Store

Categorized in: