Today rashi phalalu – 02 మార్చి 2023, గురువారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. Check today horoscope in Telugu by renowned astrologer Vakkantham Chandramouli gaaru.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


కొత్త పనులు చేపడతారు. కుటుంబ సభ్యులు వారి వంతు సహకారం అందుతుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. స్థిరాస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు ఇంటాబయటా అనుకూల వాతావరణం. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఆలోచించి అడుగు వేస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయ,పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతమైన కాలం. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు……పసుపు,తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. ఈశ్వరారాధన మంచిది.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

అవసరాలు పెరిగి కొత్తగా రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు. కుటుంబ సమస్యలు ఎదురుకావచ్చు. బంధువులతో అకారణంగా తగాదాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొన్ని చికాకులు. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడులు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. మహిళలకు కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. అనుకూల రంగులు….. కాఫీ,పసుపు. ప్రతికూల రంగు..ఎరుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందాన్ని పంచుకుంటారు.. మీ అభివృద్ధికి మిత్రులు సహకరిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. కొంతకాలంగా వేధిస్తున్న సమస్య పరిష్కారానికి నోచుకుంటుంది. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి.. ఊహించని ధనలాభం ఉండవచ్చు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు తమ సత్తా చాటుకుంటారు. ఉద్యోగులకు వివాదాలు తీరతాయి. వైద్యులు, శాస్త్రవేత్తలకు సమస్యల నుండి విముక్తి. విద్యార్థులు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకూల రంగులు……ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు…నేరేడు. అంగారక స్తోత్రాలు పఠించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


కుటుంబంలో కలహాలు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా మెలగండి. ఆరోగ్యపరమైన చికాకులు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మానసిక అశాంతి. ఉద్యోగులకు కొత్త విషయాలు తెలుస్తాయి. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. విద్యార్థుల ప్రయత్నాలు మందగమనంలో సాగుతాయి. మహిళలకు కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనుకూల రంగులు……కాఫీ,పసుపు. ప్రతికూల రంగు… తెలుపు. శుక్ర గ్రహ స్తోత్రాలు పఠించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


ఆకస్మిక ధన లబ్ధి ఉత్సాహాన్నిస్తుంది. ముఖ్యసమాచారం అంది ఉత్సాహం చెందుతారు. కొత్త పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొందరు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తల విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు సంతోషం కలిగిస్తాయి. మహిళలకు సంతోషకరమైన సమాచారం. అనుకూల రంగులు……గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నీలం. దత్తాత్రేయుని పూజించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పనులు సమయానికి పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది.. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నిరాశ తొలగుతుంది. ఉద్యోగులకు పనిభారం తగ్గే అవకాశాలు. వైద్యులు, పారిశ్రామికవేత్తల కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. విద్యార్థులకు సంతోషకర విషయాలు తెలుస్తాయి. మహిళలకు విశేష గౌరవం. అనుకూల రంగులు…గోధుమ, బంగారు. ప్రతికూల రంగు…నేరేడు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


వ్యవహారాలలో అవాంతరాలు చికాకు పరుస్తాయి. బంధువులతో తగాదాలు. ప్రయాణాలు ఉండవచ్చు. కుటుంబ సమస్యలు కొంత వేధిస్తాయి. ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బంది. మిత్రులే వ్యతిరేకులుగా మారడం ఇబ్బందిగా మారుతుంది. కాంట్రాక్టులు తృటిలో చేజారవచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొంత ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు విధులు భారంగా మారవచ్చు. రాజకీయవేత్తలు, ర చయితల ఆశలు నెరవేవు. విద్యార్థులకు సామాన్యస్థితి. మహిళలకు నిరుత్సాహం. అనుకూల రంగులు……గోధుమ,బంగారు. ప్రతికూల రంగు…పసుపు. హనుమాన్ ఛాలీసా పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. పనుల్లో కొన్ని ప్రతిబంధకాలు.. ఇంటాబయటా ఒత్తిడులు, కొద్దిపాటి సమస్యలు. బంధువులు,మిత్రులతో విరోధాలు పెరుగుతాయి. ఒక సమాచారం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సొమ్ము సకాలంలో అందక ఇబ్బంది పడతారు. కాంట్రాక్టులు చేజారవచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలు నిరాశతోనే గడుపుతారు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రచయితలు, క్రీడాకారులకు ఒత్తిడులు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. మహిళలకు నిరాశ తప్పదు. అనుకూల రంగులు……గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…గులాబీ. శ్రీ శివ స్తోత్రాలు పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


కొత్త పనులు చేపడతారు. ప్రస్తుత పరిస్థితులను అధిగమిస్తూ ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో ప్రత్యేక గౌరవప్రతిష్ఠలు పొందుతారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు.. శత్రువులు సైతం మీపట్ల ప్రేమాభిమానాలు చూపుతారు. అదనపు రాబడి ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కీలక సమాచారం. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. క్రీడాకారులు, వైద్యులకు కొన్ని అంచనాలలో పొరపాట్లు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం. అనుకూల రంగులు……బంగారు, తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు. ఆంజనేయ దండకం పఠించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు తీరి ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మరింత లాభిస్తుంది. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులకు అవకాశాలు సంతృప్తినిస్తాయి. మహిళల కష్టాలు తీరతాయి. అనుకూల రంగులు……గులాబీ, ఎరుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చనలు చేయండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


కష్టపడ్డా ఫలితం కనిపించదు. మీ శ్రమ వృథాగా మారుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కార్యక్రమాలలో అవాంతరాలు తప్పవు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఇంటాబయటా మరింతగా చికాకులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ చూపండి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు విస్తరణలో కొన్ని ఇబ్బందులు. ఉద్యోగులకు విధులలో సమస్యలు. రచయితలు, క్రీడాకారులకు నిరుత్సాహం. విద్యార్థులు ఎంత శ్రమపడితే అంత మంచిది. మహిళలకు కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకూల రంగులు……కాఫీ, పసుపు. ప్రతికూల రంగు…గులాబీ. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


ఆర్థిక లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. అనుకోని ఖర్చులు ఎదురుకావచ్చు. మిత్రులతో వివాదాలు చికాకు పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో అకారణంగా మాటపడతారు.. కార్యక్రమాలు కొంత మందగిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఏ మాత్రం అనుకూలం కాదు. ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదుర్కొంటారు. పారిశ్రామిక, రాజకీయవేత్తల ప్రయత్నాలు నిదానిస్తాయి. విద్యార్థులు కొన్ని సమస్యలతో సతమతం కాగలరు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. అనుకూల రంగులు…..గోధుమ, పసుపు. ప్రతికూల రంగు…ఎరుపు. సూర్యారాధన మంచిది.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: