Today rashi phalalu – 04 మార్చి 2023, శనివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. Check today horoscope in Telugu by renowned astrologer Vakkantham Chandramouli gaaru.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఆర్థిక ఇబ్బందులు తలనెప్పిగా మారతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఒప్పందాలు కొన్ని రద్దుచేసుకుంటారు. సోదరులు, మిత్రులతో విభేదాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అంతగా ఉండవు.. ఉద్యోగులకు అనుకోని మార్పులు సంభవం. చిత్రపరిశ్రమ వారు, రాజకీయవేత్తలకు పర్యటనలు వాయిదా పడతాయి. విద్యార్థుల యత్నాలలో స్వల్ప ఆటంకాలు. మహిళలకు నిరాశ తప్పదు. అదృష్ట రంగులు……. పసుపు, తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. గణపతిని పూజించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

కార్యక్రమాలు అనుకున్న సమయానికి సజావుగా సాగుతాయి. బంధువుల నుంచి ఆస్తి లేదా ధనలాభ సూచనలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. కాంట్రాక్టర్లకు అనుకూల పరిస్థితులు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు విస్తరణయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు కొన్ని రావచ్చు. క్రీడాకారులు, వైద్యులకు ఉత్సాహవంతమైన రోజు. విద్యార్థులు తమ ఆశలు నెరవేర్చుకుంటారు. మహిళలకు నూతనోత్సాహం. అదృష్ట రంగులు……. ఆకుపచ్చ. గులాబీ. ప్రతికూల రంగు…తెలుపు. గణేశాష్టకం పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


కుటుంబంలో ఒడిదుడుకులు. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొన్ని చిక్కులు. ఉద్యోగులకు స్థానమార్పులు. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థుల శ్రమ మరింత పెరుగుతుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు. అదృష్ట రంగులు… తెలుపు, కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


నూతన ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి. ప్రముఖుల సమావేశాల్లో పాల్గొంటారు. ఇంత కాలం రావలసిన బాకీలు సైతం వసూలవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆప్తులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఊహించని మార్పులు. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులకు శ్రమ ఫలిస్తుంది. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు. మహిళలకు ఆస్తి లాభాలు. అదృష్ట రంగులు.. గులాబీ, కాఫీ. ప్రతికూల రంగు…పసుపు. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


మిత్రులతో అకారణంగా తగాదాలు. పనులు మధ్యలోనే విరమిస్తారు. కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు. రాబడి అంతగా ఉండదు. ఉద్యోగాల్లో అదనపు పనిభారం. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొంత ఓపిక వహించాలి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలు అనుకూలించవు. విద్యార్థులకు శ్రమాధిక్యం. మహిళలకు మానసిక అశాంతి. అదృష్ట రంగులు……. నీలం, గులాబీ. ప్రతికూల రంగు…నేరేడు. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


కార్యక్రమాలు అనుకున్న విధంగా సకాలంలో పూర్తి కాగలవు. కుటుంబంలో శుభకార్యాలకు ప్రణాళిక సిద్ధం చేస్తారు.. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగ యత్నాలలో కదలికలు. ఆదాయం మీ అవసరాలకు తగినంతగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాల్లో హోదాలు దక్కుతాయి. రాజకీయవేత్తలు, వైద్యులకు కొంత అనుకూలత. విద్యార్థులకు తొందరపాటు నిర్ణయాలతో అవకాశాలు దూరం కావచ్చు. మహిళలు సంతోషకరమైన వార్తలు వింటారు. అదృష్ట రంగులు… కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు. దత్తాత్రేయుని పూజించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. స్నేహితులతో సంతోషం గడుపుతారు. శుభకార్యాల నిర్వహణలో మీ ప్రమేయం చాటుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అనుకున్నంత లాభాలు తధ్యం. ఉద్యోగులు మరింత సంతోషదాయకంగా గడుపుతారు. కళాకారులు, ఐటీ నిపుణులు అనుకున్నది సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. అదృష్ట రంగులు……. ఎరుపు, గులాబీ. ప్రతికూల రంగు…పసుపు. హనుమాన్ ఛాలీసా పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

వ్యయప్రయాసలతోనే కాలం గడుపుతారు. కార్యక్రమాలు కొంత జాప్యమైనా పూర్తి చేస్తారు. కుటుంబంలో మీ మాటంటే వ్యతిరేకత పెరుగుతుంది. బంధువులతో తగాదాలు. రాబడి మరింత తగ్గి నిరాశ చెందుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తల కృషి అంతగా ఫలించదు. ఉద్యోగులకు విధులలో అవాంతరాలు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు సామాన్యంగా గడుపుతారు. విద్యార్థులకు శ్రమే మిగులుతుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. అదృష్ట రంగులు……. నలుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


ముఖ్యమైన కార్యక్రమాల పూర్తిలో జాప్యం. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య సయోధ్య లోపించి సమస్యలు ఎదుర్కొంటారు. నిర్ణయాల్లో తొందరపాటు తగదు. ఆలోచనలు నిలకడగా ఉండవు. రాబడి నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త వివాదాలు. ఉద్యోగులు విధులను మందగమనంలో సాగిస్తారు. విద్యార్థులకు అవకాశాల ఎంపికలో అవాంతరాలు. మహిళలు కొంత ఆందోళన చెందుతారు. అదృష్ట రంగులు……. పసుపు, లేత ఎరుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. శివాష్టకం పఠించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


కార్యక్రమాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఆస్తుల విషయంలో ఒప్పందానికి సిద్ధపడతారు. పాత మిత్రుల కలయిక. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాల దిశగా కొనసాగుతారు. ఉద్యోగులకు కీలక సందేశం రాగలదు. పారిశ్రామికవేత్తలు, రచయితలు సరైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల యత్నాలలో ముందడుగు. మహిళలకు శుభ వర్తమానాలు. అదృష్ట రంగులు……. నీలం,ఆకుపచ్చ. ప్రతికూల రంగు…తెలుపు. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


ఉత్సాహంగా కార్యక్రమాలు చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపార, వాణిజ్యవేత్తలు విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రశాంతంగా గడుపుతారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు శ్రమ ఫలించి సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. మహిళలకు నూతనోత్సాహం. అదృష్ట రంగులు……. ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు…తెలుపు. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


కార్యక్రమాలు కొన్ని మందకొడిగా సాగుతాయి. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. కొన్ని రుగ్మతలు కొంత బాధిస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు కొంత తగ్గు ముఖం పడతాయి. ఉద్యోగ విధులు నిరాశ పరుస్తాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు తొందరపాటు నిర్ణయాలు తగదు. విద్యార్థులకు కొత్త ఇబ్బందులు. మహిళలకు కుటుంబంలో చికాకులు. అదృష్ట రంగులు……. బంగారు, తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు. ఆదిత్య హృదయం పఠించాలి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: