Telugu Yearly Horoscope 2024 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్బంగా 12 రాశుల వారికి రాబోయే పన్నెండు నెలల్లో జన్మ తేది/సూర్య రాశి ప్రకారం ఈ సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. Yearly rasi phalalu for all 12 zodiac signs.
మేషం (21 మార్చ్ – 19 ఏప్రిల్)
మనోబలం, సంకల్ప బలం మీకు తోడుగా నిలుస్తాయి. సుదీర్ఘకార్ఘకాలంగా మీకు సవాలుగా నిలుస్తున్న ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. ఆప్తుల ద్వారా మీకు పరిపూర్ణ మద్దతు లభిస్తుంది. సామాజిక కార్యక్రమామాలపై మరింత దృష్టి సారిస్తారు. తరచూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడాల్సి వస్తుంది. అయితే వెను వెంటనే ఉపశమనం పొందుతారు. చిత్రవిచిత్రమైన రీతిలో కొన్ని అద్భుత సంఘటనలు చూస్తారు. మీ ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు ఈ ఏడాది కొంత వేగం పుంజుకునే అవకాశం. ముఖ్యమైన కార్యక్రమాక్రమాలను పూర్తి చేయడంలో అవరోధాలు తొలగుతాయి. మీ స్వంత ఇంటి కల నెరవేరవచ్చు. తీర్థయాత్రలు, పర్య టక ప్రదేశాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితిని చక్క దిద్దుకుంటూ అవసరాలను తీర్చుకుంటారు. కొందరు మిమ్మల్ని నమ్మించి వంచించే ప్రయత్నం చేసి విఫలమవుతారు. వ్యాపారస్తులు మొదటి అర్థ సంవత్సరం సాధారణంగానూ, అనంతరం అధిక లాభాలు ఆర్జిస్తారు. కొందరు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ఎటువంటి ఒత్తిడులు, సమస్యలున్నా మనోబలంతో అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, వైద్య రంగాల వారికి విశేష పురస్కారాలు, తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయదారులు కొత్త పెట్టుబడులను స్వీకరిస్తారు. విద్యార్థులు, మహిళలకు శుభవార్తలు. ఏప్రిల్, జూలై, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో అన్ని విషయాలలో కొంత అప్రమత్తత అవసరం.
అదృష్ట సంఖ్య – 9.
వృషభం ( 20 ఏప్రిల్- 20 మే)
బాధలు, సమస్యల నుండి క్రమేక్రమేపీ బయటపడే శక్తి లభిస్తుంది. ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక వివాదం సర్దుకునే అవకాశాలున్నాయి. ఆప్తులు, బంధువులు మీపట్ల ప్రేమ కనబరుస్తారు. స్థిరాస్తి వివాదాలపై చొరవ తీసుకుని పరిష్కరించుకుంటారు. మీరు చేపట్టే కార్యక్రమాక్రమాలన్నీ శ్రమతో పూర్తి కాగలవు. అపవాదుల నుండి విముక్తి లభిస్తుంది, ప్రశంసలు సైతం అందుతాయి. మీ మౌనమే మీకు ఆయుధంగా మారి సహకరిస్తుంది. విద్యార్థులు పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయి. తరచూ ప్రయాణాలు చేయడం ద్వారా కొంత ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఉద్యోగ ప్రయప్రత్నాలు మరింత ఫలించి తగిన లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో పెను మార్పులు ఉండవచ్చు. మీకు రావలసిన డబ్బు ఊహించని రీతిలో అందవచ్చు. వ్యాపార లావాదేవీలను ఒక పద్ధతి ప్రకారం నిర్వహించి మీరే స్వయం నిర్ణయాలు తీసుకుంటూ లాభపడతారు. ఉద్యోగాలలో ప్రమోప్రషన్లు, కొందరికి ఇంక్రిమెంట్లు రావచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులు, టెక్నికల్ రంగాలకు చెందిన వారు తెలివితేటలతో విజయాల బాటపడతారు. వ్యవసాయదారులు పంటల సాగులో ఫలితం కనిపిస్తుంది. మహిళలకు పుట్టింటి వారి నుంచి కొంత లబ్ధి చేకూరే అవకాశం. ఏప్రిల్, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ నెలలు పరీక్షా సమయం. తగిన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య సమస్యలు.
అదృష్ట సంఖ్య – 6.
మిథునం (21 మే – 20 జూన్)
ఎటువంటి ప్రయత్నం చేసినా మొదట ఆటంకాలు, తదుపరి విజయాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో వ్యవహారాలను చక్కదిద్దుతారు. మీలో పోటీతత్వం పెరిగి కొన్ని వృథా ఖర్చులు చేస్తారు. ఆదాయానికి మొదట్లో ఇబ్బందిపడ్డా క్రమేపీ అధిగమిస్తారు. ప్రముఖులు మీకు పంపిన వర్తమానంతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు ద్వితీయార్ధంలో పరిష్కారమవుతాయి. ద్వితీయార్థమంతా శుభకార్యాల నిర్వహణ, ఇంట్లో సందడి వాతావరణం ఉద్యోగ లాభాలతో గడిచిపోతుంది. కొన్ని కేసుల నేర్పుగా నుంచి గట్టెక్కుతారు. కాంట్రాక్టుల విషయంలో అనుకున్నది సాధిస్తారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు చాకచక్యంగా నిర్వహించడంలో మీకు మీరే సాటి అనిపించుకుంటారు. లాభాలకు కొదవ ఉండదు. ఉద్యోగాలలో జరిగే మార్పులతో ప్రయోజనం కలుగుతుంది. ఉన్నతాధికారులు కూడా మీ పనితనాన్ని గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలు, వైద్యులు, సాంకేతిక నిపుణులు తమలోని ప్రతిభ చాటుకుంటారు. వ్యవసాయదారులకు పెట్టుబడులకు మార్గం దొరుకుతుంది. మహిళలకు స్థిరాస్తి లాభాలు ఉండవచ్చు. జనవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో కొత్త సమస్యలు, మనశ్శాంతి లోపించడం, అనారోగ్యం, వృథా ఖర్చులు ఉండవచ్చు.
అదృష్ట సంఖ్య–5.
కర్కాటకం (21 జూన్ – 22 జులై)
ఇంతకాలం నిరీక్షణ ఫలించి నిరుద్యోగులు మంచి ఉద్యోగాలు సాధిస్తారు. అనుకున్న కార్యక్రమాలను స్వల్ప ఆటంకాలు అధిగమిస్తూ పూర్తి చేస్తారు. మీ గతం గురించిన విశేషాలు స్నేహితులతో పంచుకుంటారు. అయినవారితో ఆస్తి తగాదాలు నెలకొనే అవకాశం. అయితే, ప్రతి విషయంలోనూ నిదానమే ప్రదానం అన్న సూత్రాన్ని పాటించడం మంచిది. బంధువర్గం మీ పై మరింతగా ఒత్తిడులు పెంచుతారు. ద్వితీయార్థంలో ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. కొన్ని సమస్యలు వెంటాడుతూ మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఒక సంఘటన ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొత్త కాంట్రాక్టులను ఎట్టకేలకు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి స్థిరత్వం కలిగి ఉంటుంది. రావలసిన డబ్బు కొంత అంది అవసరాలు తీరతాయి. వ్యాపార లావాదేవీలపై పట్టు సాధించినా ఏడాది చివరిలో కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు, అప్రమత్తత అవసరం. ఉద్యోగాలలో ఊహించని మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు మరింత రాణింపు ఉంటుంది. వ్యవసాయదారుల ఆశలు నెరవేరతాయి. విద్యార్థులు తాము నిర్దేశించుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. జనవరి, ఫిబ్రవరి, జూన్, అక్టోబర్ నెలలు కొంత పరీక్షగా ఉంటాయి.
అదృష్ట సంఖ్య – 2
సింహం (23 జులై – 22ను ఆగష్టు)
కొన్ని సమస్యలను ఆత్మవిశ్వాసం, మరింత ఓర్పుతో పరిష్కరించుకుంటారు. మీ సత్తా అందరిలోనూ చాటుకునేందుకు తగిన సమయమిదే. కొందరు అవాంతరాలు కల్పించినా ముఖ్య వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ప్రముఖుల నుండి మీకు సరైన గుర్తింపు, ఆహ్వానం అందుతుంది. నిరుద్యోగులు తమ కృషికి తగిన ఉద్యోగం సాధిస్తారు. ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యలు, వైద్యుల సలహాలు పొందాల్సిన అవసరం రావచ్చు. ఖర్చులు కూడా కొంత అధికం కావచ్చు. భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు నెలకొన్నా పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టర్లు గతం కంటే అనుకూలమైన సమయం. ఆర్థికంగా ఇబ్బందులను అధిగమిస్తూ, కొన్ని సర్దుబాట్లతో గడుపుతారు. వ్యాపారులు పెట్టుబడులు పెరిగి క్రమేపీ లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఊహించని బదిలీలు ఉండవచ్చు. అయితే మీ పనితీరు పై కూడా ప్రశంసలు రావచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులు, ఐటీ నిపుణులకు గతంతో పోలిస్తే మెరుగైన కాలం. విద్యార్థులు అనుకున్నది సాధించేందుకు ముందుకు సాగుతారు. వ్యవసాయదారులకు రెండవ పంట సానుకూలమవుతుంది. ఫిబ్రవరి, మార్చి, జూలై, నవంబర్ నెలల్లో కొంత మందకొడిగా ఉంటుంది.
అదృష్ట సంఖ్య–1
కన్య (23 ఆగష్టు – 22 అక్టోబర్)
ఆశ్చర్యకరంగా కొన్ని కార్యక్రమాలు మీ ప్రమేయం లేకుండానే పూర్తి చేస్తారు. అత్యంత విలాసవంతంగా గడుపుతారు. అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఆదాయానికి ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండానే గడిచిపోతుంది. తగిన ప్రణాళికతో సిద్ధపడతారు. వివాహాది శుభకార్యాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తారు. సోదరులు, మిత్రులు మీపై ఉంచిన బాధ్యతలు సంపూర్ణంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు తమలోని ప్రతిభను నిరూపించుకుంటారు. వ్యాపారస్తులు తమ నైపుణ్యతతో అభివృద్ధి పథంలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీ హోదాలు మరింత పెరిగి ఉన్నతస్థానం అలంకరిస్తారు. రాజకీయవేత్తలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వీరి అంచనాలు నిజమవుతాయి. కళాకారులు సైతం కొత్త అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. కొన్ని శారీరక రుగ్మతల నుంచి బయటపడతారు. మార్చి, ఏప్రిల్, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో ఏమరుపాటు తగదు. లేనిపోని వివాదాలు.
అదృష్ట సంఖ్య….5
తుల (23 సెప్టెంబర్ – 22 అక్టోబర్)
భవిష్యత్తు పై కొంత సందిగ్ధత నెలకొంటుంది. అయితే ఎటువంటి కార్యక్రమాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ప్రతి విషయానికి కొంత భయపడే అవకాశం ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగడం ఉత్తమం. ఇంటి సభ్యులే సమస్యలు సృష్టించి సవాలుగా నిలుస్తారు. అయితే కోపతాపాలకు తావివ్వవద్దు. ముఖ్యంగా ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం ఎంతైనా అవసరం. ఆదాయానికి మించిన ఖర్చులతో ఎలా సర్దుబాటు చేసుకోవాలో సతమతం అవుతుంటారు. అయితే మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అధిగమించేందుకు యత్నిస్తారు. మిత్రులు మీ పై చేసిన విమర్శలు అవాస్తవాలని ద్వితీయార్థంలో వెల్లడి కాగలదు. వ్యాపారాలను విస్తరించాలన్న చిరకాల కోరిక క్రమేపీ నెరవేరే అవకాశాలున్నాయి. ఉద్యోగులు ఏ బాధ్యత అప్పగించినా మనోనిబ్బరంతో పూర్తి చేస్తారు. కళాకారులు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలకు మంచి గుర్తింపు రాగలదు. వ్యవసాయదారుల కృషి వృథా పోదు. జనవరి, ఏప్రిల్, మే, సెప్టెంబర్ నెలలు కొంత ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
అదృష్ట సంఖ్య…6
వృశ్చికం (23 అక్టోబర్ – 22 నవంబర్)
అనుకున్నది సాధించాలన్న లక్ష్యం, తపనతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన కష్టం, కృషి ఫలించే సమయం. కుటుంబసభ్యుల నుంచి మీరు ఆశించి ప్రేమాభిమానాలు పొందుతారు. ఆర్థికంగా సెప్టెంబర్ వరకూ ఢోకా ఉండదు. అయితే అనంతరం ఇబ్బందిపడాల్సి వస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకర, ఉల్లాసవంతమైన వాతావరణం నెలకొంటుంది. ఒక వర్తమానం మరింత ఉత్సాహాన్నిస్తుంది. అత్యంత ఆప్తులు మీకు సరైన సమయంలో చేయూతనిస్తారు. భార్యాభర్తల మధ్య ఇంతకాలంగా చికాకు పెడుతున్న సమస్యలు సర్దుబాటు కాగలవు. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు మరింత ప్రోత్సాహం, నూతన పెట్టుబడులకు అవకాశాలు. రాజకీయవేత్తలు, కళాకారులు అనుకున్నది సాధిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలలో వేగం కనిపిస్తుంది. విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో విజయాలు, ర్యాంకులు సాధిస్తారు. క్రీడాకారులు మంచి గుర్తింపు పొందుతారు. ఫిబ్రవరి, మే, జూన్, అక్టోబర్ నెలలు అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా మెలగడం మంచిది.
అదృష్ట సంఖ్య–9
ధనుస్సు (23 నవంబర్ – 22 డిసెంబర్)
ముఖ్య కార్యక్రమాలు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. బంధువర్గంతో మనస్పర్థలు ఏర్పడినా క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఒక కీలకమైన డాక్యుమెంట్ కోసం అన్వేషణ సాగిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు కొంత ఇబ్బంది కలిగే సూచనలు. ఆస్తి వ్యవహారాలు చక్కదిద్దే పనిలో అవాంతరాలు. సన్నిహితులు, మిత్రుల సహాయసహకారాలే మీకు చేదోడుగా ఉంటాయి. ఆర్థికంగా కాస్త ఊరట కలిగి ద్వితీయార్థంలో మెరుగుపడుతుంది. అయితే లేనిపోని ఖర్చులు మీదపడే అవకాశం. సంఘంలో గౌరవం పెరిగినా కుటుంబంలో చికాకులు తలనొప్పిగా మారతాయి. తీర్థ యాత్రలు తరచూ చేస్తారు. కోర్టు కేసులు ద్వితీయార్థం నుండి కొలిక్కి వచ్చే సూచనలు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు యత్నాలు నెమ్మదిగా కలిసివస్తాయి. వ్యాపారాలు, వాణిజ్యవర్గాలకు లాభనష్టాలు సమానస్థాయిలో ఉంటాయి. ఉద్యోగులు కోరుకున్న బదిలీలు లేదా మార్పులు పొందుతారు. అలాగే, విధుల్లో ప్రతిబంధకాలు ఎట్టకేలకు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు అవకాశాలు కొన్ని శ్రమానంతరం దక్కుతాయి. వ్యవసాయదారులకు ఊరట లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు కొత్త సంస్థల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తారు. క్రీడాకారులు, విద్యార్థులు ప్రతిభను నిరూపించుకుంటారు. మార్చి, జూన్,జూలై, నవంబర్ నెలలు ప్రతికూలం. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు.
అదృష్ట సంఖ్య–3
మకరం (23 డిసెంబర్ – 22 జనవరి)
వీరు గతం కంటే మెరుగైన ఫలితాలు పొందే అవకాశం. ప్రతి పనిలోనూ విజయం సాధించేందుకు తగిన కృషి చేస్తారు. బంధువులు, స్నేహితులతో కొద్దిపాటి విభేదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. ఇతరులకు చేతనైన సహాయం అందిస్తారు. సోదరీ,సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లు, రియల్ఎస్టేట్ల వారు లక్ష్యసాధన దిశగా కదులుతారు. వివాహాది శుభకార్యాల నిర్వహణపై ఒక అంచనాకు వస్తారు. విద్యార్థులు కోరుకున్న ర్యాంకులు, ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం పై నిర్లక్ష్యం వీడాలి, ఆహార విహారాదులలో తగు జాగ్రత్తలు పాటించడం మంచిది. దైవకార్యాలలో నిమగ్నమవుతారు. వ్యాపారాలు, వాణిజ్యవర్గాలకు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులు తమ విధులు చక్కదిద్దడంలో ఆటంకాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులకు పట్టింది బంగారమే అనే విధంగా ఉంటుంది. కళాకారులు, రాజకీయవేత్తలకు సన్మానాలు, సత్కారాలు జరుగుతాయి. ఏప్రిల్, జూలై, ఆగస్టు, డిసెంబర్ నెలలు కొంత చికాకు పరుస్తాయి. ఇంటాబయటా కలహాలు వంటి ఫలితాలు కనిపిస్తాయి.
అదృష్ట సంఖ్య–8
కుంభం (23 జనవరి – 22 ఫిబ్రవరి)
మీ కృషి, పట్టుదలతో క్లిష్టమైన కార్యాలను సైతం పూర్తి చేస్తారు. ఖరీదైన వస్తువులు, వాహనాలు కొంటారు. రాబడి అనూహ్యంగా పెరిగి ఉత్సాహంగా అడుగులేస్తారు. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం కుదుటపడి మనశ్శాంతి పొందుతారు. రియల్ఎస్టేట్లు, కాంట్రాక్టర్లు ఎట్టకేలకు లాభాలు దక్కించుకుంటారు. కొన్ని కేసుల నుంచి బయటపడే అవకాశం. ఇతరులు చేసిన పొరపాట్లు మీపై మోపేందుకు యత్నిస్తారు. అప్రమత్తతతో మెలగాలి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు లాభాలు కనిపిస్తాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. కళాకారులకు ద్వితీయార్ధం నుండి మరిన్ని అవకాశాలు రాగలవు. విద్యార్థులు, క్రీడాకారులకు అనూహ్యమైన విజయాలు. జనవరి, మే, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు సాధారణ స్థాయిలో ఉంటాయి.
అదృష్ట సంఖ్య–8
మీనం (23 ఫిబ్రవరి – 20 మార్చ్)
వీరికి అంతా అనుకూలంగా కనిపించినా మధ్యలో కొన్ని చికాకులు తప్పవు. ఆర్థికంగా కొన్ని వెసులుబాట్లు కలిగి రుణభారాలు తగ్గుతాయి. కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాలు, వాహనాలు కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తారు. ఆత్మీయులు, సోదరులతో సఖ్యత నెలకొంటుంది. కొన్ని వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టర్లు, రియల్ఎస్టేట్ వర్గాలకు విశేషంగా కలిసివచ్చే సమయం. వ్యాపారులు, వాణిజ్యవర్గాలు ఉత్సాహంగా లావాదేవీలు చేపడతారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు అనుకూల పరిస్థితులు. రాజకీయవేత్తలకు శ్రమానంతరం పదవీయోగం, విశేష ప్రజాదరణ. క్రీడాకారులు ద్వితీయార్థంలో కొన్ని విజయాలు సాధిస్తారు. ఫిబ్రవరి, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు ప్రతికూలంగా ఉంటాయి.
అదృష్ట సంఖ్య–3
Yearly Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu