Ramayanam – 11 : Manthara instigates Kaikeyi
రాముడికి పట్టాభిషేకం జరగనున్న విషయం చెప్పి, కైకేయిని రెచ్చగొడదామని తాను అనుకుంటే, కౌసల్య కంటే ఆనందంగా కైకేయి ఉండటం చూసి మంధర ఆశ్చర్యపోతుంది. రాముడు రాజవుతున్నాడని తెలిసి ఆనందించడం ఆమె అమాయకత్వానికి నిదర్శనమని మంధర అంటుంది. రాజ్యాన్ని రాముడికి పట్టం కడితే, భరతుడి పరిస్థితి ఏమిటనేది ఒకసారి ఆలోచించుకోమని చెబుతుంది. రాముడు రాజైతే అప్పుడు భరతుడు అతనికి ఒక సోదరుడిగా కాకుండా, ఒక సేవకుడిగా పడి ఉండవలసి వస్తుందని చెబుతుంది. అలా సేవకుడిగానే భరతుడి జీవితం ముగిసిపోవలసి ఉంటుందని అంటుంది.
మంధర మాటలు కైకేయిపై పనిచేస్తాయి, నిజమే తన మంచితనం వలన భరతుడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకూడదని అనుకుంటుంది. రాజు కావలసిన లక్షణాలు తన కుమారుడికి కూడా ఉన్నాయి కనుక, భరతుడిని రాజును చేయడంలో దశరథుడికి అనుమానం ఎందుకని అనుకుంటుంది. దశరథుడిని ఎలాగైనా ఒప్పించి, అయోధ్యకి భరతుడిని రాజును చేయాలని నిర్ణయించుకుంటుంది. అవసరమైతే గతంలో దశరథుడు తనకి ఇచ్చిన వరాలను ఈ సందర్భంలో ఉపయోగించాలని నిర్ణయించుకుంటుంది.
అదే సమయంలో రాముడి పట్టాభిషేక వార్తను కైకేయికి చెప్పడం కోసం, ఆమె మందిరానికి దశరథుడు వస్తాడు. ఆయనను చూడగానే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది. కైకేయి ఎంతో సంతోషంగా ఉంటుందని అనుకుంటూ వచ్చిన ఆయన, ఆమె అలా ఏడుస్తూ ఉండటం చూసి నివ్వెరపోతాడు విషయమేమిటని అడుగుతాడు. కారణం చెప్పకుండానే ఆమె మరింత దుఃఖంతో పొంగిపోతూ ఉంటుంది. దాంతో రాముడి పట్టాభిషేక వార్త వినడం వల్లనైనా ఆమె శోకం తీరుతుందేమోనని ఆ విషయాన్ని గురించి చెబుతాడు. రాజ్య ప్రజలంతా ఆనందిస్తున్న వేళ ఆమె బాధపడటం సరికాదని ఓదార్చబోతాడు.
రాముడి పట్టాభిషేకం జరుగుతుంటే కౌసల్య ఆనందించాలిగానీ, భరతుడి తల్లి ఎలా సంతోషిస్తుందని కైకేయి అంటుంది. భార్యగా తాను అయోధ్య నగరంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి తనని తక్కువ చేసి చూస్తున్నారనీ, అయినా సరిపెట్టుకుంటే తన కుమారుడైన భరతుడిని కూడా అవమానిస్తున్నారని ఆవేదన చెందుతుంది. రాముడిని రాజును చేయడమంటే, అది భరతుడిని అవమానించడమేనని అంటుంది. భరతుడి కంటే రాముడిని ఎక్కువగా ప్రేమించిన కైకేయి నోటివెంట ఆ మాట రావడం పట్ల దశరథుడు ఆశ్చర్యపోతాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 11 : Manthara instigates Kaikeyi
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.