Ramayanam – 96 : Lord Rama receives message from Brahma

ఎప్పటిలానే గూఢచారుల ద్వారా తన పరిపాలనా సంబంధమైన విషయాలను గురించి రాముడు అడిగి తెలుసుకుంటాడు. ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని అడుగుతాడు. తన పాలనకు సంబంధించి ఎవరు ఎలాంటి లోపాలను చెప్పుకుంటున్నారని ప్రశ్నిస్తాడు. అయోధ్యలో ఎవరూ ఏ కారణంగానూ కష్టాలు పడటం లేదని గూఢచారులు చెబుతారు. ఎక్కడా దొంగల భయాలు, మోసాలు లేవని అంటారు. రాముడు చేస్తున్న యజ్ఞయాగాలు వలన పంటలు బాగా పండుతున్నాయనే చెప్పుకుంటున్నారని సమాధానమిస్తారు.

ధర్మ బద్ధమైన రాముడి పరిపాలన కారణంగా పాడి పంటకు ఎలాంటి లోటూ లేకుండా జీవిస్తున్నారని అంటారు. ఏదైనా అన్యాయం జరిగితే నేరుగా వెళ్లి రాముడికి చెప్పుకోవచ్చనే ధైర్యంతో వాళ్లంతా ఉంటున్నారని చెబుతారు. ఏ గ్రామానికి వెళ్లినా పేదరికంతో, ఆకలితో బాధపడుతున్నవారు కనిపించడం లేదని అంటారు. నీతి, న్యాయం రెండూ కూడా కలిసి నడుస్తున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. రాజ్యం మొత్తంలో ఎక్కడా కూడా యాచకులు కనిపించడం లేదనీ, ఇంతకు మించి ఒక రాజ్యం సుభిక్షంగా ఉందని చెప్పడానికి నిదర్శనం ఏమి కావాలంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.

ఇక అయోధ్యలో గో సంపద విపరీతంగా పెరిగిపోతోందనీ, గ్రామాలన్నీ గోవులతో కళకళలాడిపోతున్నాయని చెబుతారు. ధర్మం నాలుగు పాదాల నడిచే ప్రాంతాల్లో గోవులు వృద్ధి చెందుతాయని పెద్దలు చెప్పినమాట నిజమనేది తమకి అర్థమైందని అంటారు. గోవుల పాలు పెరుగు తిని పెరుగుతున్న అయోధ్య యువకులు బలంగా తయారవుతున్నారనీ, ఇకపై కండబలంలోను అయోధ్యావాసులు తమ ప్రత్యేకతను చాటుకోవడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతారు. ఎప్పటికీ రాముడే తమ ప్రభువుగా ఉండాలని అయోధ్య ప్రజలంతా కోరుకుంటున్నారని అంటారు.

అదే సమయంలో లక్ష్మణుడు అక్కడికి వస్తాడు. విషయమేమిటని రాముడు అడుగుతాడు. ఆయన కోసం ఒక మహర్షి వచ్చాడనీ ముఖ్యమైన విషయమేదో మాట్లాడాలని అంటున్నాడని చెబుతాడు. దాంతో రాముడు గూఢచారులను అక్కడి నుంచి పంపించి వేస్తాడు. వాళ్లంతా వెళ్లిన తరువాత ఆ మహర్షిని లోపలికి సాదరంగా తీసుకురమ్మని లక్ష్మణుడితో చెబుతాడు. అలాగేనని చెప్పి వెళ్లిన లక్ష్మణుడు, ఒక మహర్షిని వెంటబెట్టుకుని లోపలోకి వస్తాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 96 : Lord Rama receives message from Brahma

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: