Ramayanam – 20 : Anasuya invites Lord Rama Sita

అత్రి మహర్షి ఆహ్వానం మేరకు సీతారామలక్ష్మణులు చిత్రకూటంలోని వాళ్ల ఆశ్రమానికి వెళతారు. అనసూయదేవి వాళ్లను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తుంది. సీతకి కొన్ని దివ్యమైన ఆభరణాలను అందజేస్తుంది. అదే సమయంలో రామలక్ష్మణులకు కొన్ని దివ్యాస్త్రాలను అత్రి మహర్షి అందజేస్తాడు. అక్కడ కొంతసేపు విశ్రమించిన తరువాత తిరిగి బయలుదేరుతారు. కొంత కాలం పాటు చిత్రకూటంలోనే ఉండి ఆ తరువాత వెళ్లమని అత్రి మహర్షి చెబుతాడు. ఆయన సూచనకి ఏదో కారణం ఉంటుందని గ్రహించిన లక్ష్మణుడు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తాడు.

చిత్రకూటంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సీతారాములు అక్కడ ఆనందంగా ఉంటారు. ఎప్పటికప్పుడు వాళ్లకి కావలసినవి అందజేస్తూ ఉంటాడు లక్ష్మణుడు. ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో రోజులు గడిచిపోతుంటాయి. రావణాసురుడి చెల్లెలైన “శూర్పణఖ” ఒక రోజున ఆ ప్రాంతం మీదుగా వెళుతూ సీతను చూస్తుంది. ఆమెను అనుసరిస్తూ ఆశ్రమం దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ రాముడిని చూసిన ఆమె ఆశ్చర్యపోతుంది. నిలువెత్తు అందమైన విగ్రహంలా ఉన్న రాముడిని చూడగానే ఆమె మనసు వశం తప్పుతుంది.

రాముడి దగ్గరికి వెళ్లిన శూర్పణఖ తనని తానుగా పరిచయం చేసుకుంటుంది. తాను ఎవరన్నది చెబుతుంది, అతని పట్ల తనకి గల అనురక్తిని గురించి వివరిస్తుంది. తాను ఏకపత్నీ వ్రతుడనని చెప్పిన రాముడు, ఆమెకి లక్ష్మణుడుని చూపుతాడు. దాంతో ఆమె లక్ష్మణుడి దగ్గరికి వెళ్లి అతని పట్ల తనకి గల వ్యామోహాన్ని గురించి చెబుతుంది. శూర్పణఖకు దూరంగా వెళ్లడానికి లక్ష్మణుడు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోతోంది. దాంతో ఆయన తీవ్రమైన అసహనానికి లోనవుతాడు.

తాను రాముడికి సంబంధించిన కర్తవ్యదీక్షలో ఉన్నాననీ, అందువలన వెంటనే వెళ్లిపొమ్మని లక్ష్మణుడు చెబుతాడు. ఆ మాటలను ఆమె ఎంతమాత్రం లెక్కచేయకుండా, అతనికి మరింత దగ్గర కావడానికి ప్రయత్నిస్తుంది. దాంతో లక్ష్మణుడికి కోపం వచ్చేసి ఆమె ముక్కు, చెవులు కోసేస్తాడు. మోహంతో వెళ్లిన తనని లక్ష్మణుడు ఆ విధంగా అవమానపరచడాన్ని శూర్పణఖ తట్టుకోలేకపోతుంది. తనకి జరిగిన అవమానాన్ని గురించి ఆమె తన సోదరుడైన రావణుడితో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది. దాంతో ఆయన ఆగ్రహావేశాలకు లోనవుతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 20 : Anasuya invites Lord Rama Sita

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: