Ramayanam – 19 : Bharata meets Lord Rama

సీతారాములు చిత్రకూటంలో విడిది చేశారు. చిత్రకూట పర్వత అందాలను చూస్తూ ఆ దంపతులు ఆనందంతో పొంగిపోతుంటారు. అక్కడి ప్రశాంతమైన వాతావరణం నచ్చడంతో సీత కూడా చాలా సంతోషంగా ఉంటుంది. చిత్రకూట పర్వతంపై నుంచి లక్ష్మణుడు పరిసరాలను గమనిస్తూ ఉంటాడు. దూరం నుంచి ఎవరో గుంపులుగా వస్తుండటం గమనించిన ఆయన, పరిశీలనగా చూస్తాడు. ఆ గుంపులకు ముందుగా భరతుడు ఉండటం చూసి ఆగ్రహావేశాలకు లోనవుతాడు. తమని సాధించడం కోసమే భరతుడు మందీ మార్బలంతో వస్తున్నాడని రాముడితో చెబుతాడు.

భరతుడు అలాంటివాడు కాదనీ, తనకి హాని చేసే ఆలోచన కూడా అతను మనసులోకి రానీయడని రాముడు చెబుతాడు. ఆవేశంలో భరతుడి వ్యక్తిత్వాన్ని గురించి తప్పుగా మాట్లాడటం మంచిది కాదని అంటాడు. అంతలో భరతుడు అక్కడికి వస్తాడు. వస్తూనే రాముడి పాదాలకు పెనవేసుకుపోతాడు తనని క్షమించమని కోరతాడు. రాముడు అతణ్ణి ఆత్మీయంగా పైకి లేవనెత్తి, తండ్రిగారు ఎలా ఉన్నారని అడుగుతాడు. ఆయన తనువు చాలించారని భరతుడు చెప్పగానే, రాముడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. సీత కూడా ఆవేదన చెందుతుంది. రామలక్ష్మణులు తమ తండ్రికి తర్పణాలు వదులుతారు.

తన తల్లి మాటలను పట్టించుకోవద్దనీ, తనకి రాజ్యంపై సింహాసనంపై ఎలాంటి వ్యామోహం లేదని రాముడితో భరతుడు అంటాడు. అయోధ్యకు వచ్చి పరిపాలించమని కోరతాడు. ఏదో మాయ కమ్ముకోవడం వలన తాను అలా ప్రవర్తించానని కైకేయి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తుంది. దశరథుడి నుంచి తాను పొందిన వరాలను ఉపసంహరించుకుంటున్నాననీ, అయోధ్యకు తిరిగి రమ్మని కైకేయి కోరుతుంది. లేకపోతే తాను చేసిన పాపం జీవితాంతం తనని పట్టిపీడిస్తూనే ఉంటుందని ఆవేదన చెందుతుంది.

భరతుడు అయోధ్యను పాలించాలనేది తండ్రి మాట, తనని వనవాసానికి వెళ్లమన్నది తండ్రి మాట. అందువలన వాటికి భంగం కలిగించవద్దని రాముడు అంటాడు. తాను తిరిగి అయోధ్యకు వస్తే తండ్రిమాట తప్పినట్టు అవుతుందని చెబుతాడు. లోకుల దృష్టిలో తామంతా చులకన అవుతామని అంటాడు. అందువలన తాను వనవాసం చేయడమే సరైనదని సమాధానమిస్తాడు. అయితే పాదుకలను ఇవ్వమనీ, రాముడు తిరిగి వచ్చేవరకూ వాటినే సింహాసనంపై ఉంచి పాలన సాగిస్తానని భరతుడు అంటాడు అందుకు రాముడు సమ్మతిస్తాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 19 : Bharata meets Lord Rama

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: