Ramayanam – 21 : Shurpanakha sadness Ravan angry

రాముడిని చూసి ఆయనపట్ల వ్యామోహానికి లోనైన శూర్పణఖకి ముక్కు కోసేస్తాడు లక్ష్మణుడు. దాంతో ఆమె అక్కడి నుంచి నేరుగా రావణాసురుడి దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. శూర్పణఖ రాముడిని చూసి ఇష్టపడిన విషయం చెప్పకుండ తనకు అన్యాయంగా అవమానం జరిగిందని విలపిస్తోంది. కావున సీతకు అవమానం చేయాలనీ రావణుడిని కోరుతుంది. ఆమె మాటలను నమ్మిన రావణుడు, సీతను తీసుకొచ్చి బానిసను చేస్తానంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు.

రావణుడి ఆవేశం చూసిన అతని సోదరుడు విభీషణుడు, శూర్పణఖ మాటలను నమ్మి అనవసరమైన గొడవలు కొని తెచ్చుకోవద్దని చెబుతాడు. కాలం కలిసిరాకపోతే చాలా చిన్నదిగా కనిపించే విషయమే పెద్ద యుద్ధానికి దారి తీసిన సందర్భాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తాడు. అందువలన తొందరపాటు పనికిరాదని అంటాడు. జరిగిన సంఘటనలో ఎవరిది తప్పో తెలుసుకోకుండా, అవతలివారి పరాక్రమం ఎంతటిదో అంచనా వేయకుండా ముందుకువెళ్లడం భావ్యం కాదని చెబుతాడు. కోరి కయ్యానికి దిగడం వలన అనర్థాలు జరిగే అవకాశాలు ఎక్కువని హితవు చెబుతాడు.

విభీషణుడి మాటలను రావణుడు కొట్టిపారేస్తాడు. తన సోదరిని అవమానపరిచినవారిని అంత తేలికగా వదలనని అంటాడు. శూర్పణఖ తన సోదరి అని తెలిసి కూడా ఆ నరులు, ఆమె ముక్కు కోశారంటే అది కచ్చితంగా తనని అవమానపరచడమేనని చెబుతాడు. కనుక రావణుడికి చెందినవారితో పెట్టుకుంటే ఎలా ఉంటుందనేది వాళ్లకి తెలిసేలా చేయవలసిన అవసరం ఉందని అంటాడు. మంచితనంతో తాము ముడుచుకుని కూర్చుంటే, తమని పరాక్రమహీనులుగా వాళ్లు భావించే అవకాశాలు ఉన్నాయని చెబుతాడు.

ఏ విషయంలోనైనా సహనంతో ఉండటం, విచక్షణతో ఆలోచించడం వివేకవంతులు లక్షణమే అవుతుందిగానీ, అది చేతగానితనం ఎలా అవుతుందని విభీషణుడు అంటాడు. మానవులు సాధారణమైనవారే అయినా, వాళ్లు వైవాహిక జీవితాన్ని ఎంతో ధర్మబద్ధమైనదిగా భావిస్తారని చెబుతాడు. అలాంటివారి విషయంలో జోక్యం చేసుకోవడం శూర్పణఖ చేసిన అపరాధమే అవుతుందని అంటాడు. అక్కడే ఉన్న రావణుడి మరో సోదరుడు కుంభకర్ణుడు అతని మాటలను ఖండిస్తాడు. శూర్పణఖ విషయంలో ఆ మానవులు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే రావణుడి ఆలోచన సరైనదేనని సమర్థిస్తాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 21 : Shurpanakha sadness Ravan angry

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: